బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఈయన బుధవారం ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే. అయితే ఇర్ఫాన్ అకాల మృతిపై అయన చిన్ననాటి స్నేహితుడు హైదర్ అలీ జైదీ స్పందించారు. ప్రస్తుతం భారత్ పూర్ ఎస్పీ గా సేవలందిస్తున్న జైదీ బాల్య మిత్రుడు ఇర్ఫాన్ మరణ వార్త తెలియగానే భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అయన చిన్నప్పుడు ఇర్ఫాన్ తో కలిసి తిరిగిన రోజులను గుర్తు చేస్తుకున్నారు.

ఇర్ఫాన్ టీచర్ కావాలని అయన తల్లి ఎప్పుడు కోరుకునేదని తెలిపారు జైదీ. ఇర్ఫాన్ ఖాన్ చాలా గొప్ప వ్యక్తి అని, ఇప్పటి వరకు ఇర్ఫాన్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా అంటూనే కన్నీటి పర్యంతమయ్యారు. ఇటువంటి విషాదాన్ని తట్టుకోగలిగే శక్తి ఇర్ఫాన్ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అని తెలిపారు.
Irrfan Khan's friend, Haider Ali Zaidi, the SP of Bharatpur, shares a video after coming to know of his death pic.twitter.com/IsZhRVAWEq
— Jayadev (@jayadevcalamur) April 29, 2020
ప్రముఖ హిందీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేపటి క్రితం మరణించారు. ఇటీవలే “న్యూరోఎండోక్రిన్ ట్యూమర్” అనే అరుదైన క్యాన్సర్ వ్యాధి నుంచి పోరాడి ఇండియా కు తిరిగివచ్చారు ఇర్ఫాన్ ఖాన్. ఏప్రిల్ 25 న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) జైపూర్‌లో కన్నుమూశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి కూడా చూసుకోవడానికి నోచుకోలేకపోయాడు ఇర్ఫాన్ ఖాన్. తన తల్లి అంత్యక్రియలను వీడియో మాధ్యమంగా ద్వారా వీక్షించి తల్లడిల్లిపోయారు ఇర్ఫాన్. కన్నతల్లి మరణించి నాలుగైదు రోజులు కూడా కాలేదు… అపుడే ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అనారోగ్యంతో మరణించడం హృదయవిదారకం. ఇర్ఫాన్ అకాల మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.




































