Featured

Vijay Devarakonda: సుకుమార్ కోసం ఏడాది ఆగాల్సిందేనా..ఈ లోపు మరో ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. పేరు వినగానే ఎక్కువగా అర్జున్ రెడ్డి సినిమా మాత్రమే గుర్తుకు వస్తుంది. అంతలా అతడికి ఈ సినిమా ప్లస్ అయింది. అర్జున్ రెడ్డి కంటే ముందు అతడు ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు.

Vijay Devarakonda: సుకుమార్ కోసం ఏడాది ఆగాల్సిందేనా..ఈ లోపు మరో ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరోగా అతడు మెప్పించాడు. దీనిని తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే అతడికి అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ వచ్చింది.
తర్వాత అతడు గీతాగోవిందంతో క్లాస్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకునేందుకు ‘లైగర్’ సినిమాలో బిజీగా ఉన్నారు.

Vijay Devarakonda: సుకుమార్ కోసం ఏడాది ఆగాల్సిందేనా..ఈ లోపు మరో ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటిసారిగా దీనిని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్వకత్వంలోనే అనేది తెలిసిందే. కానీ ఆ డేట్స్ ఫిక్స్ కానట్టే ఉన్నాయి. ఎందుకంటే.. సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ పుష్పది రూల్ ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా పూర్తి కావడానికి 10 నెలలకు పైగా సమయం తీసుకోనున్నట్లు సమాచారం.

వెయిట్ చేయడం విజయ్ కు సవాలే.. అందుకే మరో సినిమా..

అయితే లైగర్ సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ.. మొదటగా సుకుమార్ తో అనుకున్నా.. ఈ లోపు మరో ప్రాజెక్ట్ పూర్తి చేసి.. తర్వాత సుకుమార్ తో జతకట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పుష్ప సినిమా మొత్తం అయిపోయే సరికి ఏడాది పడుతుంది. ఇంత వరకు వెయిట్ చేయడం అంటే విజయ్ దేవరకొండకు సవాలే.. అందుకే మరో సినిమాకు ఓకె చెప్పేయనున్నట్లు టాక్. త్వరలేనే దీనికి సంబంధించి అధికారికంగా కూడా తెలియజేయనున్నారు. అది ఎవరి దర్శకత్వంలో అనేది మాత్రం తెలియదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago