Featured

Bala krishna : బిగ్‌బాస్ షోకు హోస్ట్ గా బాలకృష్ణ..?

Bigg Boss Telugu Season 6: గత సీజన్‌లతో పోలిస్తే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. షో మేకర్స్ కొన్ని ఆహ్లాదకరమైన అంశాలను జోడించడానికి ప్రయత్నించినప్పటికీ .. ఆసక్తికరమైన టాస్క్‌లను కేటాయించినప్పటికీ.. పోటీదారులు పెద్దగా ఉత్సాహం చూపకపోవడం వీక్షకులను నిరాశపరిచింది. ఇప్పుడు.. ఈ విషయాన్ని గ్రహించిన షో నిర్వాహకులు వీక్షకులకు మంచి కంటెంట్‌ను అందించాలనుకుంటున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో కొత్త సీజన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చాలావరకు తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఓటీటీలో ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ OTT కోసం షో మేకర్స్ ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అయితే దీనికి ఎవరు హోస్ట్ చేస్తారనే దానిపై తాజా ఊహాగానాలు ఉన్నాయి.

Bigg Boss Telugu Season 6: బిగ్‌బాస్ తెలుగు తదుపరి సీజన్ కు హోస్ట్ గా బాలకృష్ణ..?

తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను నియమించాలని షో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆహాపై సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ షోతో తన అరంగేట్రం చేసిన తర్వాత బాలకృష్ణ గొప్ప హోస్ట్ అని నిరూపించుకున్నాడు. ఒకవేళ బాలకృష్ణ ఈ షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపితే, నాగార్జున షో నుండి తప్పుకునే అవకాశం ఉంది.
బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ :

నాగార్జున కూడా ఒప్పుకున్నట్లే.. కారణం బిజీ షెడ్యూల్..

టాలీవుడ్ కింగ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని .. తన షెడ్యూల్ మధ్య బిగ్ బాస్ లో సరిపోయే అవకాశం లేదని.. అందుకే అతడు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంలేదనే సమాచారం. నాగ్ తన మునుపటి చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్ అయిన బంగార్రాజుతో బిజీగా ఉండటమే కాకుండా.. రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నటించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ యొక్క బాలీవుడ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్రా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి మేకర్స్ కొత్త హోస్ట్‌ను తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి బాలయ్య ఖరారు అయినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago