గతంలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో సమంత నటించబోతుందనే వార్తలొచ్చాయి. అంతలోనే సమంత సినిమాలలో నటించడంలేదంటూ గాసిప్స్ కూడా మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ ఇవన్నీ ఒట్టి పుకార్లేనంటూ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ సినిమాలో సమంత నటించబోతోందని తాజా సమాచారం. పెళ్లైన తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న సమంత మళ్లీ అలాంటి పాత్రలలో నటించేందుకు సిద్ధమవుతోందనే వార్త వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రొత్థ మూవీలో ఆమె నటించబోతోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఇందుకు సంబంధించిన వార్తలలో నిజనిజాల మాట ప్రక్కనపెడితే.. క్లారిటీ త్రివిక్రమ్ మూవీలో సమంత నటిస్తే నాగార్జునకు అవమానం తప్పదనే గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. నాగార్జునకు త్రివిక్రమ్ కు మధ్య మన్మధుడు 2 సమయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందుకే ఆ సినిమా ప్రమోషన్ టైంలో త్రివిక్రమ్ పేరు ఎత్తలేదు నాగార్జున. మన్మధుడు సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్‌ను మన్మధుడు 2 సినిమా విషయంలోనూ కూడా సహకరించాలని నాగార్జున కోరినప్పుడు త్రివిక్రమ్ నో చెప్పాడమే అందుకు కారణమని మీడియా కధనం. అలా తన నాగార్జునతో విభేధం పెట్టుకున్న త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో సమంత నటిస్తుందా అనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ సమంత అలా చేస్తే అది ఖచ్చితంగా నాగార్జునకు అవమానమేనంటూ టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
అయితే టాలీవుడ్ లో ఇలాంటివి షరామామూలే.! ఏదేమైనా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో నిజంగానే సమంత నటిస్తే… నాగ్, త్రివిక్రమ్ మధ్య ఉన్న విభేదాలు కూడా సమసిపోయినట్టే భావించాల్సి ఉంటుందనే పాజిటివ్ ధింకింగ్ కూడా మరోవైపు వినిపిస్తోంది. సినిమా వార్తలను ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ కు ఈ వార్త సంగతి ఎలా వున్నా ముందు ఎన్టిఆర్, త్రివిక్రమ్ ల మూవీ త్వరగా విడుదలైతే చూడాలన్న ఆతృత మాత్రం కనబడుతుంది.????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…