గతంలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో సమంత నటించబోతుందనే వార్తలొచ్చాయి. అంతలోనే సమంత సినిమాలలో నటించడంలేదంటూ గాసిప్స్ కూడా మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ ఇవన్నీ ఒట్టి పుకార్లేనంటూ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ సినిమాలో సమంత నటించబోతోందని తాజా సమాచారం. పెళ్లైన తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న సమంత మళ్లీ అలాంటి పాత్రలలో నటించేందుకు సిద్ధమవుతోందనే వార్త వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రొత్థ మూవీలో ఆమె నటించబోతోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

ఇందుకు సంబంధించిన వార్తలలో నిజనిజాల మాట ప్రక్కనపెడితే.. క్లారిటీ త్రివిక్రమ్ మూవీలో సమంత నటిస్తే నాగార్జునకు అవమానం తప్పదనే గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. నాగార్జునకు త్రివిక్రమ్ కు మధ్య మన్మధుడు 2 సమయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందుకే ఆ సినిమా ప్రమోషన్ టైంలో త్రివిక్రమ్ పేరు ఎత్తలేదు నాగార్జున. మన్మధుడు సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్‌ను మన్మధుడు 2 సినిమా విషయంలోనూ కూడా సహకరించాలని నాగార్జున కోరినప్పుడు త్రివిక్రమ్ నో చెప్పాడమే అందుకు కారణమని మీడియా కధనం. అలా తన నాగార్జునతో విభేధం పెట్టుకున్న త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో సమంత నటిస్తుందా అనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ సమంత అలా చేస్తే అది ఖచ్చితంగా నాగార్జునకు అవమానమేనంటూ టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

అయితే టాలీవుడ్ లో ఇలాంటివి షరామామూలే.! ఏదేమైనా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో నిజంగానే సమంత నటిస్తే… నాగ్, త్రివిక్రమ్ మధ్య ఉన్న విభేదాలు కూడా సమసిపోయినట్టే భావించాల్సి ఉంటుందనే పాజిటివ్ ధింకింగ్ కూడా మరోవైపు వినిపిస్తోంది. సినిమా వార్తలను ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ కు ఈ వార్త సంగతి ఎలా వున్నా ముందు ఎన్టిఆర్, త్రివిక్రమ్ ల మూవీ త్వరగా విడుదలైతే చూడాలన్న ఆతృత మాత్రం కనబడుతుంది.👍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here