బాలయ్య సైలెంటయ్యాడు సరే.. మరి రోజా మాటేమిటి.? (బాలకృష్ణ బాటలోనే రోజాకు అవమానం జరిగిందా.?)

0
295

తెలుగు సినీరంగంలో ప్రముఖ హీరోలందరి సరసన నటించి అగ్రకధానాయికగా ప్రేక్షకుల అభినంధనలందుకున్న రోజా రాజకీయరంగంలోకూడా తనుకు తానే సాటి అని నిరూపించుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్స్ తో కేంద్రం విధించిన లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ షూటింగ్స్ జరగక సినీ కార్మికులు.. ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిగారితో సినీ ప్రముఖులంతా కలిసి చిరంజీవి ఇంట్లో చర్చలు జరిపిన సంగతి తెల్సిందే.. ఇదే అంశంపై బాలయ్య, నాగబాబు మాటకు మాట అనుకున్నా సంగతి కూడా తెలిసిందే.. కాగా తాజాగా ఇదే అంశంపై ఎమ్మెల్యే రోజా కూడా తనని చర్చలకు పిలవనందుకు కొంచెం అసంతృప్తిగా వున్నట్లుగా, తెలంగాణా సీఎం కేసీఆర్ తో మంచి సంబంధాలు ఉన్న రోజాను కూడా సమావేశానికి పిలిస్తే బాగుండేదని సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నట్టు సమాచారం.

సినీ నటి రోజా చిత్రరంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాకుండా జబర్దస్త్ షోతో బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతూనే, రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకపక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలను బ్యాలెన్స్ చేయడంలో ఫెయిల్ అయిన దాఖలాలెన్నో వున్నాయి. జబర్దస్త్ షోలో రోజా పక్కనే కో జడ్జ్ పాత్ర పోషించిన నాగబాబు కూడా రాజకీయాల్లో చేతులు కాల్చుకున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. అయితే రోజా మాత్రం ఎమ్మెల్యేగా బాధ్యతలు తలకెత్తుకొని, జబర్దస్త్ జడ్జిగా ప్రధాన పాత్ర పోషించింది. అంతేకాదు నగరి నుంచి వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభంజనం సృష్టించింది. అటు బుల్లితెర నటులైనా.. ఇటు టాలీవుడ్ ఆర్టిస్టులైనా థమకు ఏ కష్టమొచ్చినా వాళ్ళంతా ఎమ్మెల్యే రోజా ముందు తమ సమస్యను పెట్టి పరిష్కరించుకుంటారనే టాక్ ఉంది.

అయితే తాజాగా కరోనా నేపథ్యంలో సినిమా మరియు టీవీ షౌల షూటింగులు కూడా నిలిచిపోయాయి. ఈ నేపధ్సయంలో వీరి సమస్యను తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సినీ పరిశ్రమ పెద్దలను తనను వచ్చి కలవమని చెప్పారు. అయితే తెలుగు పరిశ్రమకు సంబంధించిన ఒక వర్గం మాత్రమే వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిసిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇదే విషయాన్ని హీరో నందమూరి బాలకృష్ణను ప్రశ్నించారు, ఈ క్తరమంలో తనను ఎవరూ పిలవలేదని, హైదరబాద్ లో భూముల కేటాయింపుల కోసం సీఎం ను కలిసారా అంటూ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బాలయ్యలా రోజా బయటకు చెప్పకపోయినా సందర్భం చూసి అసంతృప్తి వెళ్లగక్కే ఛాన్స్ వుండనేవుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. చూద్దాం.. మరి బాలయ్యలాగ రోజా కూడా ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో..!☺️

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here