Pooja Hegde: పవన్ భవదీయుడు భగత్ సింగ్ నుంచి తప్పుకున్న పూజ…కారణం అదేనా?
Pooja Hegde: పూజా హెగ్డే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు. ఇకపోతే ఈమెకు ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఈమె కెరియర్ పై ఏ విధమైనటువంటి ప్రభావం చూపించలేదని చెప్పవచ్చు. ఇలా వరుస ఫ్లాప్ చిత్రాలు ఎదురైనా ఈమెకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈమె పవన్ కళ్యాణ్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే మొదలయ్యేలా కనిపించడం లేదు.
పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని ప్రాజెక్టు కోసం పూజ హెగ్డే తన డేట్స్ బ్లాక్ చేయడం కుదరడం లేదు.
ఈ క్రమంలోనే ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ తమిళ సినిమా ‘వినోదయా సితం’ రీమేక్ చేయనున్నారు. అందువలన ఈయన చేయబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి రావడానికి మరింత ఆలస్యం కానుంది. దీంతో ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని సినిమా కోసం పూజ హెగ్డే తన సమయం వృధా కాకుండా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ సినిమాలోనూ,అలాగే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ సినిమాలతో బిజీకానున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…