Featured

Actor Pradeep: అచ్యుత్ చనిపోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి నాతో ఏం చెప్పారంటే… యాక్టర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్!

Actor Pradeep: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాల్లో నటుడిగా అదేవిధంగా బుల్లితెర సీరియల్స్ లో స్టార్ నటుడిగా కొనసాగిన ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కి దూరమైనప్పటికీ వెండితెరపై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈయన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

Actor Pradeep: అచ్యుత్ చనిపోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి నాతో అలా అన్నారు.. యాక్టర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్!

కొత్తగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన స్నేహితుడు, తన మిత్రుడు అచ్యుత్ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్యుత్ మరణం ఒక మిస్టరీగా ఉండిపోయింది. అసలు అచ్యుత్ మరణానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశకు ప్రదీప్ సమాధానం చెబుతూ అచ్యుత్ మరణం హిస్టరీ కాదు. అతని మరణానికి ప్రత్యక్ష సాక్షి నేనే అంటూ సమాధానం చెప్పారు.

Actor Pradeep: అచ్యుత్ చనిపోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి నాతో అలా అన్నారు.. యాక్టర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్!

అచ్యుత్ ప్రాణం పోయే సమయంలో నేను అతని పక్కనే ఉన్నానని అతని మరణంలో ఎలాంటి హిస్టరీ లేదని, అతను సహజ మరణం పొందారని ప్రదీప్ తెలిపారు. అచ్యుత్ ఎక్కువగా నాన్ వెజ్ తినే వారు. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో నాన్ వెజ్ పూర్తిగా మానేశారు.ప్రతి రోజు షూటింగ్ ఉన్నా కూడా మా ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి వదిన నాకు భోజనం పెట్టు అంటూ భోజనం చేసేవారు. మా ఇద్దరి జర్నీ సుమారు 14 సంవత్సరాలపాటు కొనసాగిందని అచ్యుత్ తెలిపారు.

అచ్యుత్ చనిపోయే ముందు రోజు రాత్రి మా ఇంటికి వచ్చారు. సాయంత్రం నాతో మాట్లాడుతూ రేపు అన్నయ్య సీరియల్ టీమ్ తో కలసి తిరుపతి వెళ్తున్నా అని చెప్పారు.సరే జాగ్రత్త అని చెప్పాను.ఆసమయంలో అచ్యుత్ కాస్త ఆయాస పడ్డారు.ఏమైంది అని అడిగితే ఇప్పుడే ఎండోస్కోపీ చేయించుకున్న కాస్త నోరు పూసినట్టు ఉంది అంటూ సమాధానం చెప్పగా కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పాను.మరుసటి రోజు ఉదయం నేను అన్నపూర్ణ స్టూడియోకి షూటింగ్ కోసం వెళ్ళగా రైల్వే స్టేషన్ కు వెళ్లే సమయంలో అస్వస్థతకు గురై హాస్పిటల్ కి వెళ్ళాడని ఫోన్ వచ్చింది.

ఆయనది సహజ మరణం…

ఫోన్ కాగానే హుటాహుటిన తను హాస్పిటల్ కు వెళ్ళినట్టు ప్రదీప్ తెలిపారు. అక్కడి వెళ్తే ఆయనకు హార్ట్ ఎటాక్ అని చెప్పారు. డాక్టర్స్ తన గురించిహోప్స్ వదిలేసారు అదే సమయంలో తన భార్య రమ అక్కడే కూర్చుని ఏడుస్తున్నారు.చివరి ప్రయత్నంగా ఒక ఇంజక్షన్ ఉంది దాన్ని ట్రై చేద్దామని డాక్టర్ ట్రై చేశారు. ఇక అతని ప్రాణాలు కొట్టుమిట్టాడుతుండగా బయటకు వచ్చి నేనే తన భార్యకు కాస్తా తన నోట్లో నీళ్లు పోయమని చెప్పాను. ఇది జరిగినది అచ్యుత్ మరణం లో ఎలాంటి హిస్టరీ లేదు. ఆయన సహజంగా మరణించారని ప్రదీప్ తెలిపారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లోనే అచ్యుత్ భార్య రమ పిల్లలిద్దరూ కూడా లైఫ్ లో సెటిల్ అయ్యారని పిల్లలకి మ్యాచ్ చూస్తున్నారని ప్రదీప్ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago