Featured

Jabardasth Vinod : తండ్రైన జబర్దస్త్ వినోద్.. లేడీ గెటప్స్ వేయడంతో తేడా అంటూ అందరూ తిట్టారంటూ ఎమోషనల్..!

Jabardasth Vinod : జబర్దస్త్ వేదిక ఎంతో మందికి జీవితాన్నిచ్చి నిలబెట్టింది. జబర్దస్త్ లో వస్తున్న వాళ్లలో చాలా మంది ఇపుడు సినిమాల్లో కనిపిస్తున్నారు. సుధీర్ వంటివారు ఏకంగా ఒక చిన్న సైజు హీరో రేంజ్ తెచ్చేసుకున్నారు. ఫాలోయింగ్ మాములుగా లేదు జబర్దస్త్ వారికి. సినిమాల్లో హీరోగా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక జబర్దస్త్ లేడీ గెట్ అప్ వేసే వారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మంది లేడీ గెట్ అప్స్ తో జబర్దస్త్ లో అలరించారు. అందరిలోనూ చాలా క్రేజ్ సంపాదించుకున్నది మాత్రం వినోదిని అలియాస్ వినోద్.

తండ్రి అయ్యాక ఎమోషనల్ వీడియో….

జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర వినోద్ కాంబినేషన్ హిట్ పెయిర్, చాలా రోజులు వీళ్ళ స్కిట్ హవా నడిచింది. లేడీ గెట్ అప్ వేసేవాళ్లలో మంచి క్రేజ్ తో అమ్మాయే అని జనాలు ఫిక్స్ అయిపోయిన వ్యక్తి వినోద్. చాలా మందికి ఇప్పటికి వినోదిని అమ్మాయి కాదు అబ్బాయి అనే విషయం తెలుసుండకపోవచ్చు. అంతలా ఆకట్టుకున్నాడు వినోద్. అయితే లేడీ గెట్ అప్ అనగానే బయట ఎన్నో అవమానాలను భరించాల్సి ఉంటుంది. అలానే వినోద్ విషయంలో కూడా చాలా మంది అవమానించారు.

అబ్బాయి వి కాదు అంటూ హేళన చేశారట. ఇక వీటన్నింటికి చెక్ పెడుతూ వినోద్ గత ఏడాది లాక్ డౌన్ టైం లో పెళ్లి చేసుకున్నాడు. మేనత్త కూతురు విజయలక్ష్మి ని పెళ్లి చేసుకున్న వినోద్ ఇపుడు తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుని భావొద్వేగానికి లోనయ్యాడు. తన కూతురి ఫోటోలను షేర్ చేసి అందరికి షాకిచ్చాడు. ఇక సుమ సమక్షంలో క్యాష్ ప్రోగ్రామ్ లో సీమంతం కూడా చేసారు వినోద్ భార్యకు. ఆలస్యంగా తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు వినోద్. ఇటీవల తన ఇంటి యజమాని గొడవపడి వినోద్ ను తీవ్రంగా గాయపరచడం తెలిసిందే.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago