Chiranjeevi: చిరు అల్లూరి విగ్రహావిష్కరణ ఆహ్వానం వెనుక ఇంత కథ నడిచిందా.. చిరు వద్దంటేనే విజయేంద్ర ప్రసాద్ కు అవకాశం వచ్చిందా?
Chiranjeevi: ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఓ విషయం చర్చనీయాంశంగా మారింది.జులై 4వ తేదీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కావడంతో స్వయంగా ప్రధానమంత్రి భీమవరంలో ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఆహ్వానం వచ్చింది.అయితే ఇలా చిరంజీవికి మాత్రమే ఆహ్వానం రావడానికి గల కారణం గురించి కూడా ప్రస్తావించారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేయడం వల్ల ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని అందరూ భావించినప్పటికీ దీని వెనుక మరొక కారణం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.ఇకపోతే ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి కోటాలో భాగంగా నలుగురిని రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కి అవకాశం లభించింది.
ఈ విధంగా రాజ్యసభ సభ్యునిగా విజయేంద్ర ప్రసాద్ కంటే ముందుగా ఆ అవకాశం మెగాస్టార్ చిరంజీవికి వచ్చిందని అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ అవకాశాన్ని వద్దని సున్నితంగా తిరస్కరించడంతో ఆ అవకాశం విజయేంద్రప్రసాద్ కు వచ్చిందని తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జివిఎల్ నరసింహారావు ముందుగా ఈ విషయాన్ని చిరంజీవి గారితో ప్రస్తావించారని అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో తనకి ఇలాంటి పదవి వద్దని మెగాస్టార్ చెప్పడంతోనే విజయేంద్ర ప్రసాద్ ను నామినేట్ చేశారనే వార్తలు ఊపందుకున్నాయి.
అల్లూరి విగ్రహావిష్కరణ సభ వేదికపై కూడా ప్రధానమంత్రి మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత కల్పించారు.కానీ చిరంజీవి మాత్రం మోడీ ఇచ్చిన ఆఫర్ సున్నితంగా రిజెక్ట్ చేశారు. తనకు రాజకీయాలలో పెద్దగా ఆసక్తి లేదని చెప్పడంతోనే బిజెపి నేతలు సైలెంట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ చిరంజీవికి రాజ్యసభ సభ్యునిగా ఆఫర్ ప్రకటించడం వెనుక భారీ స్కెచ్ ఉందని వచ్చే ఎన్నికలలో ఏపీలో తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి పక్కా ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఏదిఏమైనా చిరంజీవి మాత్రం తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించారు ఇప్పుడు కూడా తాను దూరంగా ఉండాలని భావించడంతోనే ఈ ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…