Ramesh Babu: రమేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా రాణించలేకపోవడానికి అసలు కారణం ఇదేనా?

Ramesh Babu: రమేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా రాణించలేకపోవడానికి అసలు కారణం ఇదేనా?

Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన వారసులు రమేష్ బాబు, మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి వచ్చారు. రమేష్ బాబు కృష్ణ గారి పెద్ద కొడుకు అనే విషయం మనకు తెలిసిందే ఈయన ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా నటించి అందరినీ మెప్పించారు. బాల నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రమేష్ బాబు అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Ramesh Babu: రమేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా రాణించలేకపోవడానికి అసలు కారణం ఇదేనా?
Ramesh Babu: రమేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా రాణించలేకపోవడానికి అసలు కారణం ఇదేనా?

ఈయన సుమారు 17 సినిమాలలో హీరోగా నటించినప్పటికీ ఇతనికి సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి. తన తండ్రి కృష్ణ ఎన్నో అద్భుతమైన విజయాలను అందించినప్పటికీ రమేష్ బాబు మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. రమేష్ బాబు హీరోగా నటించిన సినిమాలలో బజారు రౌడీ, తన తండ్రితో పాటు కలిసి చేసిన ముగ్గురు కొడుకులు రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి.

Ramesh Babu: రమేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా రాణించలేకపోవడానికి అసలు కారణం ఇదేనా?

ఆ అలవాట్లే ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి..

హీరోగా రమేష్ బాబు పలు చిత్రాలలో నటించిన ఏమాత్రం ఫలితం లేకపోవడంతో ఆయన నిర్మాతగా మారారు. మహేష్ బాబు నటించిన అర్జున్, అతిధి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అనంతరం నిర్మాతగా కూడా గుర్తింపు పొందలేకపోయారు. ఇకపోతే రమేష్ బాబు ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి గల కారణం ఆయనకున్న అలవాట్లే కారణమని ఇండస్ట్రీ టాక్. ఆయన తన ఒక సూపర్ స్టార్ కుమారుడని కథల పట్ల సినిమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ.. పూర్తిగా చెడు అలవాట్లకు బానిస కావడం వల్ల తన శరీరం ఫిట్నెస్ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆయనకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఆ అలవాట్ల కారణంగా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు.ఇలా రమేష్ బాబు ఇండస్ట్రీ ప్రస్థానం కొనసాగిన నేడు ఆయన అకాల మరణం పొందడంతో పలువురు సినీ సెలబ్రిటీలు అతని మృతి పై స్పందిస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.