J.D Chakravarthy : గులాబీ సినిమా తరువాత నాకు, కృష్ణ వంశీకి మాటలు లేవు… కారణం ఏంటంటే…: నటుడు జెడి చక్రవర్తి

0
39

J.D Chakravarthy : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ అటు తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లోనూ నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా దయ అనే వెబ్ సిరీస్ తో వస్తోన్న చక్రి ఆ ప్రొమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాకు, కృష్ణ వంశీ కి విబేధాలకు కారణం అదే…

జేడి చక్రవర్తి కెరీర్ లో నెంబర్ వన్ సినిమాగా గులాబీ మిగిలిపోతుంది. ఆ సినిమాలో తొలిసారిగా చక్రి హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా సమయానికి కృష్ణ వంశీ, జేడి ఇద్దరూ మంచి స్నేహితులు. మొదట కథ చెప్పేటప్పుడే జేడిని హీరోగా పెట్టి ఈ సినిమా తీయాలని కృష్ణ వంశీ ఫిక్స్ అయిపోయాడట. ఇక సినిమా తీసేందుకు కొందరు నిర్మాతలు వస్తున్నా జేడి చక్రవర్తి ని హీరోగా ఒప్పుకోలేదట. చివరికి జేడి తనకు ఉన్న ఒక ఇల్లును తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చి సినిమా స్టార్ట్ చేయగా విషయం తెలుసుకున్న ఆర్జివి గులాబీ సినిమా కథ ఏంటి, ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియకుండానే సినిమా ప్రొడక్షన్ చేశారట.

ఆపైన అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్టులో డబ్బు పెట్టారట. అలా చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యాక కృష్ణ వంశీ, జేడి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారట. మళ్ళీ దయ వెబ్ సిరీస్ ప్రమోషన్సలో ఈ మధ్యనే కలిశామని జేడి చెప్తూ అపుడు మా మధ్య గొడవలు రావడానికి కారణం మా మధ్య ఉన్న ఇగోనే. ఒళ్ళు కొవ్వెక్కి ఇద్దరికీ నా వల్ల సినిమా హిట్ అయిందని ఎవరికి వారు అనుకున్నాం కానీ మన ఇద్దరి వల్ల సినిమా హిట్ అయిందని అనుకోలేదు అంటూ జేడి చెప్పారు.