తెలుగు బుల్లితెర పై యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూనే బుల్లితెరపై తన అద్భుతమైన యాంకరింగ్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బుల్లితెరపై యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ ఇద్దరు జోడిగా ఏ కార్యక్రమంలోనైనా సందడి చేశారంటే ఆ కార్యక్రమానికి రేటింగ్స్ అమాంతం పెరిగి పోతాయి.
ఈ క్రమంలోనే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి రష్మి అందులోనే టీమ్ లీడర్ గా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ కు ఎన్నో సార్లు పెళ్లి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇదే బాటలో జబర్దస్త్ కమెడియన్ అను ఇమ్మానియేల్ వర్ష జంట కూడా పెళ్లి చేసిన సంఘటనలు ఉన్నాయి. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్ లో భాగంగా వర్ష తన మీద వస్తున్న ట్రోలింగ్ గురించి చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తనపై వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ చూసి తన తమ్ముడు ఏంటక్కా ఇది అని అడిగినప్పుడు తట్టుకోలేకపోయానని వర్ష చెప్పగా అందుకు రష్మి రియాక్ట్ అయ్యారు.
ఇండస్ట్రీలో అమ్మాయిలు అబ్బాయిలు సమానం. మా వ్యక్తిగత జీవితాలు మాకు ఉంటాయి.అబ్బాయిలు ఎంతో మంది తో కలిసి చేసిన తప్పు కాదు కానీ అమ్మాయిలు వేరే వాళ్ళతో కలిసి చేస్తే తప్పు అని భావిస్తారు. తాజాగా రష్మీ నటిస్తున్న అటువంటి ఓ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ క్రమంలోనే చాలామంది మీరు సుధీర్ తో కలిసి నటించిన చాలా బాగుంటుందని కామెంట్లో చేశారని ఈ సందర్భంగా రష్మీ తెలిపారు.సుధీర్ ఏ అమ్మాయిలతో కలిసి చేసిన తప్పు కాదు కానీ నేను మాత్రం వేరే వాళ్ళతో చేస్తే తప్పేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…