ప్రస్తుతం తెలుగు వెండితెరపై తెలుగు హీరోయిన్స్ కాకుండా ఇతర భాషల నుంచి వచ్చిన నటీమణులు తమ హవాను కొనసాగిస్తూ స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ప్రసారమయ్యే సీరియల్స్ లో తెలుగు నటీమణుల కన్నా ఇతర భాషల నుంచి వచ్చిన నటీమణులు ఎక్కువగా పాపులారిటీని దక్కించుకున్నారు.
ముఖ్యంగా కన్నడ భాష నుంచి వచ్చిన చాలామంది బుల్లితెర నటీమణుల అచ్చం తెలుగు అమ్మాయిల మాదిరిగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.మరి కన్నడ నుంచి వచ్చి తెలుగు స్టార్ సీరియల్స్ హీరోయిన్స్ గా పేరు పొందిన ఆ నటీమణులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
గుప్పెడంత మనసు హీరోయిన్ రక్షా గౌడ, కల్యాణ వైభోగమే సీరియల్ హీరోయిన్ మేఘన లోకేష్, కేరాఫ్ అనసూయ హీరోయిన్ తేజస్వినీ, నా పేరు మీనాక్షి నవ్య స్వామి, కస్తూరి ఐశ్వర్య, కార్తీకదీపం మోనిత అలియాస్ శోభా శెట్టి, గుండమ్మ కథ పూజ మూర్తి, బంగారు గాజులు నక్షత్ర వీరందరూ కూడా కన్నడ భాష నుంచి వచ్చి తెలుగులో తమ సత్తాను చాటుకుంటున్న తెలుగు వారిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
అలాగే జానకి కలగనలేదు హీరోయిన్ ప్రియాంక, బంగారు పంజరం హీరోయిన్ నిఖిత, అమ్మ నా కోడలా హీరోయిన్ నిత్య, కోయిలమ్మ హీరోయిన్ కావ్య శ్రీ, చైత్ర రాయ్ రామ చక్కని సీత హీరోయిన్ నవ్య వంటి వారు కూడా కన్నడ భాష నుంచి వచ్చి తెలుగులో వివిధ సీరియల్స్ లో నటిస్తూ మంచి ఆదరణ దక్కించుకున్నారని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…