Movie News

Jabardasth Emmanuel: వర్షకు దూరంగా ఉన్న ఇమ్మానుయేల్… అసలు విషయం చెబుతూ ఎమోషనల్ అయిన ఇమ్మూ?

Jabardasth Emmanuel: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష.ఈ ఇద్దరు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ కూడా నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలిగింది.అదేవిధంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం మల్లెమాలవారు సైతం వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేయడమే కాకుండా ఈ జంటకు ఎన్నోసార్లు జబర్దస్త్ వేదికపై పెళ్లి కూడా చేశారు.

ఈ విధంగా ఇమ్మానుయేల్ వర్షా జంట విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ఎడమొహం పెడ మొహం పెట్టుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని, అందుకే మాట్లాడుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఇమ్మానియేల్ నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని అనే బ్రేకప్ సాంగ్ పాడారు. ఇలా ఇమ్మూ వేదికపై ఈ పాట పాడుతూ ఉన్నంతసేపు వర్ష ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా వర్షా ఎమోషనల్ అయినప్పటికీ వీరిద్దరూ దూరంగా ఉండడానికి గల కారణం బయటపడలేదు.

Jabardasth Emmanuel: వర్ష ఇమ్మూ మధ్య నిజంగా గొడవలున్నాయా…

ఇలా పాట పాడిన అనంతరం వర్ష వేదిక పైకి వెళ్ళగా ఇంద్రజ ఇమ్మానుయేల్ ను ప్రశ్నిస్తూ ఏమైంది అంటూ అడిగారు. ఇంద్రజ ఇలా అడిగినప్పటికీ ఇమ్మానుయేల్ మౌనంగా ఉండడంతో అప్పటికి ఇప్పటికీ మీ మధ్య ఏం మారడం లేదా అంటూ రష్మీ అడగగా మా మధ్య ఎప్పటికీ మారదేమో అంటూ వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల గురించి పరోక్షంగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago