Natti Kumar : సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ వైసీపీ పార్టీ సానుభూతి పరుడిగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా జగన్ తీసుకున్న ఒక నిర్ణయం గురించి నట్టి కుమార్ స్పందన పార్టీ కి విరుద్ధంగా ఉంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం బాగాలేదని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల సినిమా ఇండస్ట్రీ నుండి కమెడియన్ అలీ అలాగే రైటర్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన పోసాని కృష్ణమురళి గారికి పదవులను ఇచ్చారు. కమెడియన్ అలీ గారికి ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతలను పోసాని కృష్ణ మురళి గారికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు. ఇక ఈ నిర్ణయాన్ని నట్టి కుమార్ వ్యతిరేకించారు.
తిట్టిన వాళ్లకు పదవులు ఇస్తారనే మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది…
పోసాని గారు మెగా కుటుంబాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి ఎఫ్డిసి పదవి ఇవ్వడం వల్ల జగన్ ప్రతిపక్ష కుటుంబాలను తిట్టిన వారికే పదవులను ఇస్తాడనే టాక్ పబ్లిక్ లో నడుస్తోంది అది మంచిది కాదు. వైసీపీ లో పనిచేస్తున్న నాలాంటి వాళ్లు అలా వ్యక్తిగత విమర్శలు చేయలేని వాళ్ళు ఉన్నారు. పదవి వస్తుందని నేను ఆ పని చేయలేను అంటూ నట్టి అభిప్రాయపడ్డారు.
ఇలా ప్రతిపక్ష కుటుంబాల పై తీవ్రమైన విమర్శలు చేసిన వారి వల్ల ఓట్లు పడవు అంటూ జగన్ గారికి హిత బోధ చేశారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి పదవి అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు వారధిలా ఉండేవారికి ఇస్తే ఏదైనా సినిమా ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ నుండి పార్టీ కి లాభమ్ ఉంటుంది ఇలాంటి వాళ్లకు ఇస్తే ఏమొస్తుందో జగన్ కే తెలియాలి అంటూ మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…