తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుదీర్,రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. ఇక వీరిద్దరూ రియల్లైఫ్లో కలిసిపోతే చూడాలి అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఇక జబర్దస్త్ షోలో, అలాగే డీ షోలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీనీ ఇప్పటికి ఎన్నో సార్లు చూసి ఉంటారు. ఈ జోడిని స్టేజిపై ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు.
వీరిద్దరిపై బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రకాల ఈవెంట్లను చేశారు. సోషల్ మీడియాలో సుధీర్ రష్మి కి పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకసారి మల్లెమాల వారు వీరిద్దరికీ ఒక ఇంట్లో పెళ్లి కూడా జరిగింది చేశారు.వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించినా రష్మీ, సుధీర్ మాత్రం ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే రష్మికి పెళ్లి అయిపోయింది అంటూ జబర్దస్త్ కమెడియన్ సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకసారి షూటింగ్ అయిపోయిన తరువాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమయై పోతారు. ఈ విషయం తెలియక చాలామంది వీరిద్దరూ జీవితంలో కూడా కలిపితే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ ఉంటారని సతీష్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే సతీష్ ఒకసారి వైజాగ్ వెళితే అక్కడ ఒక వ్యక్తి సుధీర్ రష్మీ ఇద్దరు జీవితంలో కలిస్తే బాగుంటుంది అని తెలిపాడు.
రష్మికి పెళ్లి అయింది అన్న విషయం వాడికి తెలుసా? సుధీర్ కి పెళ్లి అయిందో లేదో వారికి తెలుసా? ఏదో రేటింగ్స్ కోసం నిర్వాహకులు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే అదే నిజమని నమ్ముతున్నారు. చూసే వాళ్లు ఉన్నంతవరకు అలాంటివి తీస్తూనే ఉంటారని సతీష్ తెలిపారు. అంతేకాకుండా సుధీర్, రష్మీ జీవితాంతం కలవరని సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…