Jabardasth Sathya Sree : జబర్దస్త్ లో మేల్ కమెడియన్స్ కి కొదవ లేదు కానీ ఫిమేల్ కమెడియన్ గా వచ్చి సత్య శ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంతకుముందు ఫిమేల్ కమెడియన్స్ కి బదులుగా లేడీ గెటప్ లతో కానిచ్చేవారు. నిజానికి లేడీ గెటప్ లకు మంచి క్రేజ్ ఉండేది. ఇక శాంతి స్వరూప్, వినోద్, పవన్, సాయి, హరి వంటి వారికి మంచి గుర్తింపు లేడీ గెటప్ వల్ల వచ్చింది. అలాంటి జబర్దస్త్ లో మొదటి సారి ఒక అమ్మాయి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ట్రెండ్ సెట్ చేసింది. జబర్దస్త్ వేదికపై మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకున్న సత్య శ్రీ ప్రస్తుతం జబర్దస్త్ ను వీడి వేరే ఛానెల్స్ కి వెళ్ళిపోయింది అలాగే సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. అయితే తాజాగా హీరో నితిన్ కొత్త సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ’లో ఒక సాంగ్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆ సాంగ్ గురించిన విశేషాలను తాజాగా పంచుకున్నారు సత్య శ్రీ.
శేఖర్ మాస్టర్ అదే చెప్పారు… అక్కడికి వెళ్ళాక తెలిసింది…
నితిన్ కొత్త సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ లో ‘నా పెట్టి తాళం తెరిచి’ పాటలో చీర కట్టులో డాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది సత్య. ఆ పాటకు కోరియోగ్రఫీ శేఖర్ మాస్టర్. ఆ సినిమాలో కానిస్టేబుల్ గా క్యారెక్టర్ ఆఫర్ రాగా ఒక సాంగ్ కూడా ఉంటుందని ముందే చెప్పారట కో డైరెక్టర్స్. ఇక షూటింగ్ కి వెళ్లేముందు అసలు సాంగ్ ఎలా ఉంటుంది అని వెతుకగా రికార్డింగ్ సాంగ్స్ లో వచ్చే ఆ డబల్ మీనింగ్ సాంగ్ విన్నప్పుడు ఈ పాటకు ఎలా డాన్స్ చేయాలి, నా కెరీర్ ఏంటి అనే ఆలోచనలో పడినా ఆల్రెడీ షూటింగ్ కి ఒప్పేసుకోవడం వల్ల చేయాలనుకున్నాను. ఇక షూటింగ్ వెళ్లినా ఎలా ఉంటుందో అని భయపడినా శేఖర్ మాస్టర్ నీ కెరీర్ కు ప్లస్ అవుతుంది ఆలోచించకు అని ధైర్యం చెప్పారు.
పాట ఫస్ట్ షార్ట్ నాతోనే మొదలవుతుంది. నాకు ఎక్స్ప్రెషన్స్ సరిగా రాకపోవడం వల్ల 15 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. కానీ వక్కంతం వంశీ, శేఖర్ మాస్టర్ నితిన్ గారు నాకు ఓపిగ్గా చెప్పారు. వక్కంతం వంశీ ఈ పాటలో ఎక్స్ పోజింగ్ లాంటివి ఏవీ లేవు కేవలం పాట లిరిక్స్ అలా అనిపిస్తాయి కానీ మొత్తం షూట్ అయ్యాక చూడు ఈ పాట నీ కెరీర్ కు ప్లస్ అవుతుంది అని చెప్పారు అంటూ సత్య శ్రీ చెప్పారు. ఇక పాట షూటింగ్ అయ్యాక చూస్తే సాంగ్ అనుకున్నది ఒకటి అక్కడ ఇంకోలా ఉంటుంది, అది సాంగ్ విన్నప్పుడు కంటే చూస్తే బాగా తెలుస్తుంది. అపుడే నాకు అర్థమైంది ఈ పాట నా కెరీర్ కి ప్లస్ అవుతుంది అని అంటూ సత్య శ్రీ వివరించారు.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…