బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంట్రీ అయిన బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఎంటరైన బ్యూటీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని స్టార్ సెలబ్రిటీ గా కొనసాగుతుంది. జబర్దస్త్ కార్యక్రమంలో ఇమ్మానియేల్ తో కలిపి చేసే స్కిట్లు చూస్తుంటే మాత్రం వీరి మధ్య లవ్ కేక్ నడుస్తుందని పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. ఈ విధంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వర్ష పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రసారమయ్యే “సూపర్ సీరియల్ చాంపియన్ షిప్” అనే కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమో లో భాగంగా రెండు సీరియల్ నటీనటులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో సరదాగా గేమ్స్ లో పాటిస్పేట్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వారం “ప్రేమ ఎంత మధురం”, “రామ చక్కని సీత”సీరియల్ నటి నటులు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే నటీనటులు పలు గేమ్స్ లో పోటీపడుతూ ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ ఆటలో భాగంగా ఒక స్కిట్ లో పాల్గొన్న వర్ష ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ స్కిట్ లో భాగంగా ఒక రోలర్ పై ఒక చెక్కను ఉంచి దానిపై ఒకరు నిలబడి బొమ్మను పెట్టుకోవాలి. ఈ టాస్క్ లో భాగంగా జబర్దస్త్ బ్యూటీ వర్ష రోలర్ పై ఉన్న చెక్కపై నిలబడి బొమ్మను పట్టుకుంది. ఈ క్రమంలోనే మరొక నటుడు రోలర్ ను గట్టిగా తన్నడంతో వర్ష పై నుంచి కింద పడ్డటు తెలుస్తోంది.ఉన్నఫలంగా వర్ష ప్రమాదానికి గురవడంతో అక్కడే ఉన్నటువంటి ప్రదీప్ తో సహా ఇతర నటీనటులు ఎంతో షాక్ అయ్యారు. అయితే ఈమెకు ఏదైనా ప్రమాదం జరిగిందా లేదా అనే విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…