కొత్తగా సంతానం పొందిన మహిళలు చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. పుట్టిన బిడ్డకు ఎక్కువ సమయం కేటాయించడమే దీనికి కారణం. నిద్రలేమి రాత్రుల వల్ల బాలింత మహిళల ఆయుషు తగ్గుతుందని బాలింతలు వాపోతుంటారు. అయితే వారి బాధలో నిజముందని చెబుతున్నారు యూనివర్సిటీ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ పరిశోధకులు.
ఈ అధ్యయనం స్లీప్ హెల్త్ జర్నల్లో ప్రచురితమయ్యింది. ఈ అధ్యయనం 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న 33 మంది తల్లులపై పరిశోధనలు చేశారు. మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు పరిశోధన సాగించారు. తల్లుల డీఎన్ఏను రక్త నమూనాల నుంచి సేకరించి విశ్లేషించారు. అందులో బయోలాజికల్ ఏజ్ ను గుర్తించారు.
ఆరునెలల పాటు రాత్రి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయిన తల్లుల బయోలాజికల్ ఏజ్ మూడు నుంచి ఏడు సంవత్సరాలు ఎక్కువగా కనిపించినట్లు గుర్తించారు. 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిద్రపోయిన తల్లులతో పోల్చితే వీరి బయోలాజికల్ ఏజ్ 3 నుంచి 7 సంవత్సరాలు పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. తక్కువ నిద్రపోయే తల్లుల రక్తకణాలలో టెలోమీర్ ల పొడవు తగ్గుతుందని వెల్లడైంది.
టెలోమీర్‌లు కుచించుపోవడం వల్ల క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మరణాల ముప్పు అధికంగా ఉంటుంది. పడుకునే సమయం కంటే మరో గంట ఎక్కువగా నిద్ర పోయిన వారికి బయోలాజికల్ ఏజ్ తగ్గిందని వారు వెల్లడించారు. నిద్రలేమితో దీర్ఘకాలిక ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని ఈ సందర్భంగా పరిశోధకులు చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…