Jabardasth Vinodini: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో వినోద్ ఒకరు. ఈయన వినోదిని అనే లేడీ గెటప్స్ వేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.
ఇకపోతే ఇటీవల కాలంలో జబర్దస్త్ వినోద్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇలా ఈ కార్యక్రమానికి దూరం అవడానికి గల కారణాలు తెలియలేదు అయితే చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వినోద్ జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అవడానికి గల కారణాలను తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయనని చూస్తే ఇక్కడ ఉన్నది వినోదేనా అనే సందేహం అందరికీ కలగక మానదు.
గుర్తుపట్టలేనంతగా మారిపోయారు పూర్తిగా బక్క చిక్కి ఉన్నటువంటి ఈయన తన అనారోగ్యం కారణంగానే ఇలా మారిపోయానని తెలిపారు తాను ఉన్నఫలంగా శరీర బరువు కోల్పోయారని తెలిపారు. పెద్దగా ఈ విషయం గురించి తాను పట్టించుకోలేదని కానీ ఒక నెలలో తాను ఎక్కువగా బరువు తగ్గడంతో టెస్టులు చేయించుకున్నారని దాంతో తనకు ఊపిరితిత్తులలో నీరు చేరి ఇన్ఫెక్షన్ అయ్యిందని తెలిపారు.
ఊపిరితిత్తుల సమస్య
ఈ విషయం తెలిసే నేను రెండు సంవత్సరాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ఇలా ఎలాంటి షోలు లేకుండా ట్రీట్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను అని అయితే జబర్దస్త్ మాజీ జడ్జి మంత్రి రోజా తనకు అండగా నిలబడ్డారని తెలిపారు. అయితే ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కాస్త స్థిమితంగా ఉందని షోలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయని త్వరలోనే తాను తిరిగి అందరి ముందుకు రాబోతున్నాను అంటూ వినోద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…