Jabardastha Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వర్ష. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇక్కడ కూడా విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె త్వరలోనే బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతోంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.ఈమె కూడా ఇదే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెబుతూ తాను త్వరలోనే ఓ పెద్ద కార్యక్రమంలో పాల్గొనబోతున్నానని తెలిపారు. దీంతో ఈమె బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వబోతుందని అందరూ ఫిక్స్ అయ్యారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లబోతున్న సమయంలో ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకున్నారు. ఈమె తన వాచ్మెన్ కష్టాలను చూసి వారి అబ్బాయిని చదివిస్తున్నానని తన చదువు బాధ్యతలు అన్నిటిని తానే తీసుకున్నానని తెలిపారు.
ఇలా ఇండస్ట్రీలో కమెడియన్ గాను బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి వర్షకు సినిమాలలో కూడా నటించాలని ఉందని తెలిపారు. తనకి ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోల సినిమాలలో వారికి చెల్లెలుగా నటించాలని ఉందని తెలిపారు. అదేవిధంగా లవర్ గా నటించాల్సి వస్తే అల్లు అర్జున్ తో నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
https://www.facebook.com/watch/?v=262966779784291
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…