Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండ పలు సీరియల్స్ లో కూడా నటించారు. ECILలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు లో కూడా పని చేసారు, యాక్టింగ్ కోర్స్ కుడా చేసిన ఈయన ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక సినిమాల్లో హీరోలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ ఇప్పటి తరం హీరోలు అప్పటి తరం హీరోలకు ఉన్న తేడా చెప్పారు.
బన్నీ కొట్టేసరికి నిజంగానే తగిలింది…
అప్పటి హీరోలు హీరోల్లాగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఎక్కువగా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు పలకరింపు వరకు మాత్రమే వారితో మాట కలిపే వాళ్ళం అంతకు మించి చనువు వాళ్ళు ఇచ్చేవారు కాదు, మేము తీసుకునే వాళ్ళం కాదు అంటూ జెన్నీ అల్పటి హీరోలతో ఆయన అనుభవాలను చెప్పారు. ఇక ఇప్పటితరం హీరోలలో అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించినపుడు నేను బన్నీ తండ్రి పాత్ర చనిపోయినపుడు కామెంట్ చేస్తే అతను కోపంలో నన్ను కొట్టాలి. అయితే సీన్ రిహార్సెల్ చేస్తున్నపుడు కొడితే నిజంగానే చిటికెన వేలు తగిలి నా కళ్ళజోడు కింద పడి పగిలిపోయింది. సీన్ ఓకే అయింది. ఇక వెంటనే బన్నీ మేనేజర్ ను పంపి ఆయన కళ్లజోడు పగిలి పోయింది కొత్తది కొనివండి అంటూ బన్నీ మేనేజర్ ను నా వద్దకు పంపారు.
నేను అదేమీ వద్దని చెబితే అల్లు అర్జున్ వచ్చి మీరు సీనియర్ నటులు, మా చిన్నతనం నుండి చూస్తున్నాం అలా అంటారేమిటి నావల్ల పగిలిపోయాయి అంటూ అనడంతో ఇక కాదనలేక పోయాను. ఇక వెంటనే నాకు మీరు ఒక వరం ఇయ్యండి అంటూ అడిగాను. మీ ప్రతి సినిమాలో ఒక చిన్న వేషం ఇప్పించండి అనగానే ఆయన అంతేనా ఇక వరం అంటే ఏమడుగుతారో అనుకున్నాను అంటూ నవ్వేశారు. ఇక ఆ తరువాత ఎపుడైనా కనిపిస్తే ఏంటండీ కళ్లజోడు బాగుందా బాగా కనిపిస్తున్నాయా అని అడుగుతారు అంటూ బన్నీతో తన ఫన్నీ ఇన్సిడెంట్ ను జెన్నీ గారు పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…