Ravinder -Mahalakshmi: ఇటీవల కాలంలో ట్రెండింగ్ కపుల్స్ గా మహాలక్ష్మి రవీందర్ జంట బాగా పాపులర్ అయింది.వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ కాయంతో ఉన్నటువంటి రవీందర్ ను నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ జంట సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.
తాజాగా ఈ జంట హనీమూన్ కోసం అమెరికా వెళ్లి తిరిగి వచ్చారు. వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ జంటకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తమిళంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి రవీంద్ర ఇద్దరు పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
మొదటి సీజన్ నుంచి రవీందర్ బిగ్ బాస్ కార్యక్రమాలను వీక్షిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే ఈ సీజన్లో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు వీరిద్దరి పేర్లను పరిశీలించారని వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
మరి నిజంగానే వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారా లేకపోతే రవీంద్ర మాత్రమే పాల్గొనబోతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అక్టోబర్ 9వ తేదీ వరకు వేసి చూడాలి. ఇక వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడంతో వీరి పెళ్లి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది.ఇలా ఈ జంట పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున వీరిపై విమర్శలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఆ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా సంతోషంగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…