JD Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు ఈయన జగన్ కేసులలో కీలకంగా వ్యవహరించారు. ఇలా జగన్ వ్యవహారాలతో ఎంతో పాపులారితే సంపాదించుకున్న లక్ష్మీనారాయణ త్వరలోనే నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన భీమదేవరపల్లి బ్రాంచి అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది.
రమేష్ చెప్పాల దర్శకత్వంలో ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో జెడి లక్ష్మీనారాయణతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఓ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ప్రతి ఒక్కరికి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ నటిస్తున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇదివరకు ఎంతోమంది దర్శక నిర్మాతలు వెళ్లి నాగేశ్వరరావును సినిమాలలో నటించమని సంప్రదించిన ఆయన నటించడానికి ఆసక్తి చూపలేదు.
అయితే ఇటీవల కాలంలో జరిగిన ఒక సంఘటన భారతదేశంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్ర సహజంగా ఉండడం కోసమే జేడీ లక్ష్మీనారాయణ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంప్రదించగా వారు కూడా నటించడానికి ఆసక్తి చూపారు. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…