Jandhyala Wife Annpurna : తెలుగు సినిమాకు కామెడీ అనగానే గుర్తొచ్చే పేరు జంధ్యాల. నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అంటూ ఆయన రాసిన డైలాగు ఇప్పటికీ ఫేమస్. ఇక ఆయన సినిమాల ద్వారా తెలుగులో ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాకుండా తెలుగులో ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల గారు పేరు. అందుకే ఆయనను హాస్య బ్రహ్మ అని అంటారు. ‘ముద్దమందారం’ సినిమాతో డైరెక్టర్ అయిన జంధ్యాల గారు సుమారు 50 సినిమాలకు డైరెక్షన్ చేసారు. 300 సినిమాలకు పైగా రచయిత గా డైలాగులు రాసారు. ఇక ఆయన మరణించిన తరవాత ఆయన కుటుంబం ఎక్కడా కనబడలేదు. మొదటి సారి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన భార్య అన్నపూర్ణ గారు ఆయన గురించి ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
బాలు గారు ఇల్లు ఖాళీ చేయించారు…
జంధ్యాల సుబ్బరాయ శాస్త్రి గారి భార్య అన్నపూర్ణ గారు జంధ్యాల గారి గురించి మాట్లాడుతూ ఆయన డైలాగులు కానీ స్క్రీన్ ప్లే రాసేటపుడు కానీ చాలా నిశ్శబ్దంగా చుట్టూ పరిసరాలు ఉండాలని భావిస్తారు. ఆయనకు స్నేహితులు బాగా ఉండేవారు. ఆయనకు స్నేహితుడి మేనల్లుడే ప్రదీప్ అందుకే తనకు శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పి సినిమాకు హీరో గా పెట్టుకున్నారు అంటూ చెప్పారు. ఇక సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కూడా మంచి స్నేహితుడు అంటూ తెలిపారు.
జంధ్యాల గారు మరణించాక కూడా ఇండస్ట్రీ నుండి కొంతమంది అలాగే అభిమానులు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతుంటారుంటూ చెప్పారు. ఇక బాలు గారు ఎపుడూ టచ్ లోనే ఉన్నారని ఆయన హాస్పిటల్ కి వెళ్లే నాలుగు రోజుల ముందు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలి అని అడిగితే వెంటనే మనిషిని పంపి నేను ఖాళీ చేయిస్తాను స్టూడియోలో ఉంటే ఫోన్ మాట్లాడలేను మెసేజ్ చేయండి అని మాట్లాడారట బాలు గారు. చెన్నై లో బాలు గారి ఇంటికి దగ్గర్లోనే జంధ్యాల గారి ఇల్లు ఉందట. ఇక ఆ తరువాత ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరడం, ఇక ఆయన మరణించడం జరిగింది అంటూ చివరి చూపుకు కూడా వెళ్లలేని పరిస్థితి అంటూ ఆయన గురించి తెలిపారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…