Janhvi Kapoor: అందాల తార దివంగత నటి శ్రీదేవి మరణ వార్త ఇప్పటికి ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. సినిమాలలో అన్ని భాషలలో నటిస్తూ ఎంతోమంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె దుబాయ్ లో టబ్ బాత్ లో మరణించి విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.
ఇలా శ్రీదేవి మరణించిన తర్వాత తన కుమార్తె వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే శ్రీదేవి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ ధడక్ సినిమా అవకాశాన్ని అందుకొని ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తన తల్లి తనతో గడిపిన ఆఖరి క్షణాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను అప్పటికే దడక్ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో అమ్మతో గడపడానికి సమయం లేకుండా పోయింది.
అమ్మ ఉదయమే దుబాయ్ వెళ్లాలి నైట్ తన గదిలో లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. నేను షూటింగ్ నుంచి వచ్చి అమ్మ గదికి వెళ్ళగా తన బిజీగా ఉన్నారు. దాంతో నేను నా గదికి వెళ్లి పడుకున్నాను.అమ్మ పనులన్నీ ముగించుకొని నా గదికి వచ్చిందని అయితే అప్పటికే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నాను. నేను అలా చెప్పినప్పటికీ అమ్మ అక్కడే ఉందన్న విషయం నాకు తెలుసు.
నేను నిద్రపోతూ ఉండగా అమ్మ నా దగ్గరకు వచ్చి నా తలపై చేయి వేసుకొని అలాగే కూర్చున్నారు. ఇదే నేను అమ్మతో గడిపిన ఆఖరి క్షణాలు అంటూ ఈ సందర్భంగా జాన్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మ మరణం తర్వాత కుటుంబమంతా ఒక్కటే అయ్యాము. కానీ అమ్మలేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ ఈ సందర్భంగా జాన్వీ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…