నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం జాతి రత్నాలు.ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్‌గా ఫరియాకు మంచి గుర్తింపు ఉంది. ఇక జాతి రత్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఈమె మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది. అందులో క్యూట్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ తర్వాత ఈమె దశ మారిపోతుందని అందరూ భావించారు. కానీ అదేమీ జరగలేదు. మొదటి సినిమా తర్వాత ఈమెకు వరసగా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను అని ఫరియా తెలిపింది కాని అలాంటిది ఏమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపించిన సంగతి తెలిసిందే.
అవన్నీ కూడా రూమర్స్ అని రవితేజ సినిమాలో హీరోయిన్స్ ని చూశాక క్లారిటీ వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎట్టకేలకు పరియా అబ్దుల్లాకు ఒక పేరున్న సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. శీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కబోయే ఢీ అంటే ఢీ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా ప్రకటించారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం ఢీ సినిమా గురించి మాట్లాడుతూ.. డీ కథ సీక్వెల్ కథ రెండు వేరు వేరు అని తెలిపాడు. కాకపోతే ఢీ లో ఉండే కొన్ని క్యారెక్టర్లు మాత్రం సీక్వెల్ లో వాడు కాబోతున్నట్లు తెలిపాడు. అలాగే గత సినిమాల్లో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటున్నాను అని తెలిపారు. ఈ సినిమాకు గోపీమోహన్, చూడు గోపాల్ రచయితలుగా చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…