మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల జీవన శైలిలో, ఆలోచనా విధానంలో, ఆహారపు అలవాట్లలో ఇలా ప్రతి ఒక్క దానిలో కూడా మార్పులు వచ్చాయి. ఈ మార్పుల కారణంగా ప్రతి ఒక్క మనిషి కూడా చాలామంది మనుషులు వారు తినే తిండి మంచి మంచి కలర్ ఉంటే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారు తినే తిండి బ్లాక్ కలర్ లో ఉంటే తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే ఇది తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎందుకు అంటే తినే తిండినీ కలర్ చూసి కాదు అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చూసి తినమని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నలుపు రంగు ఆహారపదార్థాలలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు అధికమని అంటున్నారు. ఈ నలుపు రంగు పదార్థాలలో ఆంతోసైనిన్స్ ఉంటాయి. నలుపు రంగు, నీలం రంగు మరియు ఉదా రంగు ఫుడ్స్ గుండెజబ్బులతో నివారించడంతో పాటు మరి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాలను కూడా నివారించడంలో ఉపయోగపడతాయి.
నల్ల నువ్వులలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి.అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత రాదు.ఇక నల్ల అంజూరం పండ్లలో ఎముకలకు ఆరోగ్యాన్నిచ్చే ఖనిజాలు ఉన్నాయి. వీటిలో కర్జూరం కంటే తక్కువ చక్కెర ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది మేలైన ఆహారం. అలాగే నల్ల పుట్టగొడుగులు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.
నల్ల ద్రాక్ష, మినప్పప్పు, బ్లాక్ బెర్రీస్, నల్ల మిరియాలు, నేరేడు కాయలు, నల్ల సోయాబీన్స్, బ్లాక్ టీ ఇలా ఎన్నో రకాల బ్లాక్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి తినే పదార్థాలు ఏవైనా కూడా అవి ఉండే కలర్ ని కాకుండా అవి ఇచ్చే ఆరోగ్యప్రయోజనాలను బట్టి ఆహార పదార్థాలను తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…