ఉసిరి పోషకాల గని అని చెప్పుకోవచ్చు.ఈ ఉసిరి వాడకం కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వంటి వ్యాధులను తగ్గిస్తుంది. విటమిన్ సి లోపం ఉన్న వారు దీన్ని తినడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఇక ఉసిరి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? అయితే ఇది కేవలం కొందరికి మాత్రమే? మరి ఉసిరి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎవరు ఈ ఉసిరిని తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డ్రై స్కీన్‌తో బాధపడే వారు : డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారు ఉసిరి తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉసిరికి ఉండే కొన్ని లక్షణాలు శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది. కాబట్టి ఉసిరి తీసుకుంటే చర్మం పొడిబారుతుంది.
కాలేయ వ్యాధి ఉన్నవారు : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడే వారు కూడా ఉసిరికి దూరంగా ఉండాలి.
తక్కువ రక్తపోటు : సాధారణంగా ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో రక్త పోటు తగ్గుతుంది. కాని లో బీపీతో బాధపడేవారు ఉసిరికి దూరంగా ఉండడమే మేలు.
కిడ్నీ రోగులు కూడా : కిడ్నీ సంబంధిత వ్యాదులతో బాధపడేవారు ఉసిరిని తీసుకునే ముందు వైద్యుల సలహాలను కచ్చితంగా తీసుకోవాలి. ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. దీంతో ఇది కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది.
జలుబు ఉన్న వారు : జలుబు ఉన్న వారు కూడా ఉసిరి కాయకు దూరంగా ఉండాలి. సహజంగా ఉసిరి చలువు చేస్తుంది. కాబట్టి జలుబు తగ్గే వరకు ఉసిరి తినకపోవడమే మంచిది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…