Jayasudha : జయసుధ… 1972 లో ‘పండంటి కాపురం’ సినిమా ద్వారా వెండితెర కు పరిచయం అయ్యి సహజ నటిగా అభిమానులలో పేరు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో నటించి దాదాపు 300 సినిమాలు చేసారు. జయసుధ నటించిన 25 సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల అవ్వడం విశేషం. తాజాగా నటిగా తన ప్రస్థానం మొదలు పెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడరు జయసుధ. ఈ క్రమంలోనే మా అసోసియేషన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొక్కుబడిగా మీటింగులు మాత్రమే ఏర్పాటు చేశారు…
మా అసోసియేషన్ అంటేనే గొడవలకు కేర్ అఫ్ అడ్రస్ గా వుంది. గతంలో జరిగిన ఎన్నికల గురించి అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య చిన్స యుద్ధమే జరిగింది. అయితే అఖరకు విష్ణు ఎన్నికలలో విజయం సాధించిన సంగతి తెలిదిందే. రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ పడినప్పుడు జయసుధ గారు ఓడిపోయారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ గారు మా అసోసియేషన్ గురించి మాట్లాడరు.

మా ఎన్నికల గొడవలు చాలా అసహ్యంగా ఉన్నాయని అవి చూడలేకనే, కొన్ని రోజులపాటు అమెరికాలోనే వున్నాను అని జయసుధ అన్నారు. మురళీమోహన్ గారు అధ్యక్షుడిగా వున్నప్పటినుండి ఇప్పటి వరకూ అందరూ మా భవనం గురించి అందరూ మాటలు చెబుతున్నారు కానీ ఎవరూ చేయట్లేదని, ఎప్పటికి అవుతుందో అర్తం అవ్వట్లేదని అన్నారు. ఇపుడు నాకు నటిగా 50 వసంతాలు వచ్చాయి, 75 వసంతాలు వచ్చేసరికి అయినా పూర్తి అవుతుందో లేదో చూడాలి అని అన్నారు. అయితే ఈ విషయంపై విష్ణు ఎలా సపందిస్తారో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.































