Movie News

JD Chakravarthy: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నాకు ఎప్పుడు పొరిగిల్లు లాంటిదే… జెడి చక్రవర్తి కామెంట్స్ వైరల్!

JD Chakravarthy: జెడి చక్రవర్తి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనంతరం కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సిరీస్ నేడు ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జె.డి చక్రవర్తి ఈ వెబ్ సిరీస్ కి తనని చాలా కాలం నుంచి అడుగుతున్నారని కానీ నాకే ఇష్టం లేక నటించడానికి దూరంగా ఉన్నానని తెలిపారు.

ఒకరోజు డైరెక్టర్ పవన్ సాదినేని స్టోరీ వినమని తనకు చెప్పారు. తప్పనిసరి పరిస్థితులలో స్టోరీ చెప్పమన్నాను ఫోన్లోనే పది నిమిషాలలో పవన్ సాదినేని వెబ్ సిరీస్ చెప్పేశారు. దీంతో ఫోన్లోనే తాను కూడా ఓకే చెప్పేసానని తెలిపారు. వర్మ గారు ఎప్పుడు ఒకటి చెప్పేవారు. ఏ డైరెక్టర్ అయినా పది నిమిషాలలో స్టోరీ చెప్పారు అంటే ఆ కథపై ఆయనకు మంచి పట్టు ఉన్నట్లేనని తెలిపారు. ఆ విషయం గుర్తు పెట్టుకొని ఈ వెబ్ సిరీస్ కి ఒకే చెప్పానని ఈ సందర్భంగా జెడి చక్రవర్తి తెలియజేశారు.

JD Chakravarthy: తెలుగు చిత్ర పరిశ్రమే నా బలం…

ఇక ఈయన గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ నాకు ఎప్పుడూ కూడా పొరిగిల్లు లాంటిదే అందుకే కొంతకాలం పాటు అక్కడికి వెళ్లి తిరిగి సొంత ఇంటికి వచ్చాను అని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ నా బలం అందుకే ఇక్కడే సినిమాలు చేస్తూ ఉన్నానని ఈ సందర్భంగా జెడి చక్రవర్తి బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago