అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత్‌లో అత్యవసర టికా వినియోగానికి అనుమతులు పొందింది. ఒకే డోసు టీకాతోనే కొవిడ్-19ను సమర్ధవంతంగా ఎదురుకొవచ్చని జాన్సన్ తెలిపింది. జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్‌లో వెల్లడించారు. భారత్‌లో టీకా వినియోగానికి జాన్సన్ & జాన్సన్‌కు చెందిన సింగిల్ డోసుకు అనుమతులు పొందిదనట్లుగా ట్వీట్‌లో పెర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. తాజా అమెరికాకు చెందిన మోడెర్నా టీకా కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ జాబితాలో జాన్సన్ టీకా చేరింది. అయితే ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్‌లు అన్ని రెండు డోసుల టీకాలు కాగా.. జాన్సన్ మాత్రం సింగిల్ డోసు వేసుకుంటే సరిపోతుంది.




























