Featured

Journalist Prabhu : వర్మ రోజు రోజుకి మరింత దిగజారిపోతున్నాడు…. మనం మాట్లాడాలంటేనే సిగ్గు పడాలి…అప్పటి వర్మ చచ్చిపోయాడు…: జర్నలిస్ట్ ప్రభు

Journalist Prabhu : వివాదాలతో బతికే జీవి ఆర్జీవి. ఏదో ఒక ఒకవిషయంలో కాంట్రావెర్సీ క్రియేట్ చేసి తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ఉండే ఆర్జీవి మరోసారి అందరికి షాక్ ఇచ్చాడు. సినిమాకు ప్రమోషన్స్ వింతగా చేసే ఆర్జీవి తాను తీసిన సినిమాలను జనాలు ఎపుడో మర్చిపోయిన తాను చేసే, మాట్లాడే కాంట్రావెర్సీల కోసం మాత్రం ఎదురుచూస్తుంటారు. లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం డేంజరస్ సినిమా ప్రొమోషన్స్ కి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాడు ఆర్జీవి. ఒకవైపు సోషల్ మీడియా లో కనిపిస్తూనే రీల్స్ చేస్తూ హీట్ కామెంట్స్ చేస్తూ మరోవైపు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు. తాజాగా అషురెడ్డి తో చేసిన ఒక ఇంటర్వ్యూ తో మరింత వైరల్ అయ్యాడు ఆర్జీవి. ఆడవాళ్ళను తాను చూసే దృష్టి కోణం అలానే ఇక అషు రెడ్డి కాళ్ళని నాకుతూ అసభ్యంగా ప్రవర్తించడం ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక వర్మ గురించి జర్నలిస్ట్ ప్రభు తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అప్పటి వర్మ మరణించాడు.. మాట్లాడాలంటే మనం సిగ్గుపడాలి….

వర్మ అషురెడ్డి తో చేసిన ఇంటర్వ్యూ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఒకప్పుడు ఉన్న వర్మ ఇప్పుడు లేడంటూ జర్నలిస్ట్ ప్రభు వాఖ్యణించారు. తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్ అయిన వర్మ ఇప్పుడు తెస్తున్నాము సినిమాలు వేరుగా ఉంటున్నాయని ఆ వర్మ చనిపోయాడంటూ మాట్లాడారు ప్రభు. డైరెక్టర్ అంటే ఎలా ఉండాలో ఒకపుడు చూపిన వర్మ ఇప్పుడు భిన్నంగా తయారయ్యాడు. ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి కూడా ఈ ఇంటర్వ్యూ వల్ల అవకాశాలు పెరుగుతయానే ఉదేశ్యంతో దిగజారి ప్రవర్తించింది అంటూ మాట్లాడారు ప్రభు.

ఆ ఇంటర్వ్యూ లో వర్మ చేసిన పనులను మాట్లాడాలంటేనే చాలా సిగ్గుగా ఉందంటూ ఇంత ప్రొమోషన్స్ చేసిన తాను ఈ మధ్య కాలంలో చేస్తున్న ఏ ఒక్క సినిమా అయిన హిట్ అయ్యిందా అంటూ మాట్లాడారు. వర్మ మాత్రమే తనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాడు అంటూ వెనకేసుకొచ్చే పిచ్చి అభిమానులు ఉన్నారు, కానీ ఇంతటి అసభ్యకరమైన పనులను పబ్లిసిటి కోసం ప్రొమోషన్స్ కోసం చేయడం సమాజానికి ఎంత ప్రమాదకరం అంటూ ప్రభు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago