Journalist Srinivas Kalluri : వైఎస్ షర్మిల తెలంగాణ కోడలే కాదు… అది కెసిఆర్ మాస్టర్ ప్లాన్….: జర్నలిస్ట్ శ్రీనివాస్ కల్లూరి

0
225

Journalist Srinivas Kalluri : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతోంది ఏ పార్టీ ఏ పార్టీ వైపు చూస్తోందో చెప్పడం కష్టంగా మారింది. రెండు రాష్ట్రాల్లోను రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తూన్న మాట వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తన పార్టీ ని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తుంది అని టాక్. నిజానికి షర్మిల పార్టీకి ఇంకా క్షేత్ర స్థాయిలో ఇంకా బలం లేదు రాజన్న బిడ్డగా ఆమెను చూస్తున్నారు అంతే. అయితే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తెలంగాణ , ఏపి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాన్ని జర్నలిస్ట్ శ్రీనివాస్ కల్లూరి.

షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ కి నష్టం….

షర్మిల తన అన్న జగన్ తో గొడవ పడి తెలంగాణలో పార్టీ పెట్టిందంటూ బయటికి వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ శ్రీనివాస్ కల్లూరి తెలిపారు. ఇక కెసిఆర్ , షర్మిల చేత రెడ్డి ఓట్లను అలాగే క్రిస్టియన్ ఓట్లను చీల్చడానికి పెట్టించాడు అంటూ ఒక వాదన ఉండగా మరోవైపు బీజేపీ కాంగ్రెస్ నుండి ఓట్లు చిల్చడానికి పెట్టించిందని మరో వాదన వినిపించిందని శ్రీనివాస్ కల్లూరి తెలిపారు. అయితే షర్మిల పార్టీ పెట్టిన ఆ ప్రభావం తెలంగాణలో పెద్దగా లేదని ఆమెను ఎవరు పట్టించుకోలేదని తెలిపారు. నిజానికి షర్మిల తీవ్ర స్థాయిలో కెసిఆర్ మీద కేటిఆర్ మీద కవిత మీద కూడా విమర్శలను చేసిన ఆమెను విమర్శించాలంటే విమర్శించాలి అన్నట్లుగా ఏదో అంటున్నారు.ఇక ఇపుడు ఆమె పారీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందని కథనలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ కి ఆమె పారీ విలీనం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. తాజాగా ఆమె ఢిల్లీ లో ఉన్నారు. రాహుల్ గాంధీ తో చర్చల నడుమ ఆమె పార్టీ విలీనం మీద మరింత అనుమానం బలపడుతోంది కానీ కాంగ్రెస్ లో పార్టీ విలీనం చేయడం వల్ల కాంగ్రెస్ కి నష్టం.షర్మిల రాజన్న కూతురు, ఆమె ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళ.

ఆమె అత్తిల్లు తెలంగాణ అని చెప్పుకుంటున్న వాస్తవానికి బ్రదర్ అనిల్ కుమార్ ది కూడా గోదావరి జిల్లా. ఆమె అత్తమామాలు హైదరాబాద్ లో ఉండటం వల్ల అలా చెప్పుకుంటుంది కానీ వారిది గోదావరి జిల్లా అనే ప్రూఫ్స్ ఉన్నాయ్. వీటినే కెసిఆర్ రేపు అస్త్రంగా వాడుతాడు. గతంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారనికి వచ్చినపుడు ఎలా అయితే తెలంగాణ సెంటిమెంట్ వాడాడో అలానే ఆమె కాంగ్రెస్ లో చేరి ప్రచారం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద పెత్తనం చేయడానికి వస్తున్నారు అంటూ సెంటిమెంట్ రాజకియం చేస్తాడు అంటూ కల్లూరి శ్రీనివాస్ తెలిపారు.