NTR: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లారు. ఈ క్రమంలోనే తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి వెళ్ళటం విశేషం. ఈయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించడంతో దేవర షూటింగ్ నిమిత్తం ఎక్కడికైనా వెళ్తున్నారని అందరూ భావించారు కానీ బెంగళూరులోని ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంటికి వెళ్లారు.
ప్రశాంత్ నీల్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సలార్ సినిమాలు ఎంత మంచి సక్సెస్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమాలో సక్సెస్ కావడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా ఈయన ఇంట్లో ఓ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలుస్తుంది.
ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి వెళ్లారు. వీరితోపాటు కాంతారా హీరో రిషబ్ శెట్టి తన భార్య ప్రగతితో కలిసి వచ్చారు. అదేవిధంగా హోమ్ భలే ఫిలిమ్స్ అధినేత యలమంచిలి రవిశంకర్, కే జి ఎఫ్ హీరో యశ్ కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలలో భాగంగా వీరందరూ కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకే ప్రేమ్ లో స్టార్స్..
ఇలా కే జి ఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక వేడుకలలో రిషబ్ శెట్టి ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే ప్రశాంత్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఎన్టీఆర్ సినిమాలలో కే జి ఎఫ్ హీరో యశ్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…