Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న దేవర సినిమా కాక మరొకటి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 అని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనులను పూర్తి చేయబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే వార్ 2 తో బిజీ కాబోతున్నారు.
ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. హృతిక్ రోషన్ హీరో నటిస్తున్నటువంటి సినిమాలు ఎన్టీఆర్ కేవలం గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని తెలిసి ఈయన పాత్ర గురించి ఆసక్తి నెలకొంది అయితే తాజాగా ఈ గెస్ట్ రోల్ చేయడం కోసం ఎన్టీఆర్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సంచలనగా మారింది.
వంద కోట్ల రూపాయలు..
ఈ సినిమాలో ఎన్టీఆర్ కేవలం గెస్ట్ పాత్రలో మాత్రమే కనిపించబోతున్నారు. ఇలా గెస్ట్ పాత్రలో కనిపించినందుకు గాను ఎన్టీఆర్ ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలిసే బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం షాక్ అవుతున్నారు. అక్కడ ఫుల్ సినిమా చేసిన స్టార్ హీరోలకు మాత్రమే వంద కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అలాంటిది ఎన్టీఆర్ గెస్ట్ పాత్రకు 100 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బెంగుళూరులో బాలికపై జరిగిన అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఇంటి బయట ఆడుకుంటున్న 11 ఏళ్ల చిన్నారిని…
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన రాజశేఖర్ తన కెరీర్‌లో కొత్త దశను ఆత్మవిశ్వాసంతో ముందుకు…
గ్రహాల సంచారం మనిషి జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ముఖ్యంగా ప్రేమ, వివాహం, సౌఖ్యం వంటి అంశాలకు…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా పేరొందిన నయనతార – విఘ్నేష్ శివన్ తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంను…
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, విస్తీర్ణం పరంగా అగ్రగామిగా నిలిచిన క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. ‘భూలోక వైకుంఠం’గా…
మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక…