Jr NTR: యాంకర్ సుమ గురించి దారుణమైన కామెంట్లు చేసిన ఎన్టీఆర్… చాదస్తం మరీ ఎక్కువ!
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులను RRR సినిమా ద్వారా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఈనెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఇప్పటికే ఎంతో మంది దర్శకులతో కలిసి ఇంటర్వ్యూలలో పాల్గొన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ తాజాగా
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇకపై ఈ ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఎన్నో ప్రశ్నలు వేశారు. తనకు కీరవాణి సంగీతం అందించిన సినిమాలలో నచ్చని పాట ఏది అని ప్రశ్నించగా ఎన్టీఆర్ సమాధానం చెబుతూ భీమవరం బుల్లోడ పాట తనకు ఏమాత్రం నచ్చదని తెలిపారు.
ఇక సింగర్స్ ఎవరు అనే ప్రశ్న ఎదురుకావడంతో ఎన్టీఆర్ తనకు మోహన భోగరాజు, గీతామాధురి గొంతు నచ్చుతుందన్నాడు.ఇక యాంకర్ సుమ గురించి కీరవాణి ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ తను కనుక మీ సినిమాలలో నటిస్తే తనకు ఎలాంటి పాత్ర ఇస్తారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ ఆశక్తికరమైన సమాధానాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ తనకు నాన్నమ్మ లేదా అమ్మమ్మ పాత్రలు ఇస్తానని ఆమెకు చాదస్తం చాలా ఎక్కువ ఎప్పుడు నోరు పారేసుకుంటుంది. తనను చూస్తేనే గయ్యాళి అత్త పాత్రలు గుర్తుకు వస్తాయి అంటూ సుమ గురించి కామెంట్ చేశారు. ఇక చరణ్ అయితే పంచాయతీలు నిర్వహించే మధ్యవర్తిగా నటించే పాత్ర ఇస్తానని తెలిపారు. మొత్తానికి సుమ విషయంలో ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…