ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో ఎదురుగా కూర్చున్న కంటెస్టెంట్లతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ.. ప్రోగ్రామ్ పై మరింత ఆసక్తి రేకెత్తించేలా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ షో సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమవుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పెళ్లి నాటి ముచ్చట్లను తన అభిమానులతో పంచుకున్నారు. తాజాగా హాట్ సీటులో కూర్చున్న కంటెస్టెంట్‌తో తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు ఎన్టీఆర్. ముందుగా తన తండ్రి హరికృష్ణతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.
వివాహం గురించి ప్రస్తావిస్తుండగా.. మా పెళ్లి చూపుల్లో మా ఆవిడ అసలు మాట్లాడలేదు అంటూ సరదాగా నవ్వుకున్నారు. పెళ్లి చూపుల్లో లక్ష్మీ ప్రణతిని చూడగానే ఎన్టీఆర్ ఓకె చెప్పగా.. తన భార్య మాత్రం ఓకె చెప్పలేదని చెప్పుకొచ్చాడు. అలా అని నో చెప్పలేదు. నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా అని ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిని అడిగారట అయితే దానికి ఆమె అప్పట్లో ఔనని గానీ.. కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.
నిశ్చితార్థానికి మాకు ఎనిమిది నెలల సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. అప్పడు కూడా తాను ఎస్ చెప్పలేదన్నారు. ప్రపంచంలో దేనినైనా అర్థం చేసుకోవచ్చు కానీ.. ఆడవాళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…