Jupudi Prabhakar Rao : గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన స్వగృహంలో ఆయన దారుణంగా హత్య చేయబడ్డాడు. మొదట్లో హత్య చేసింది టీడీపీ వాళ్ళే అంటూ జగన్ విమర్శలు గుప్పించినా ప్రస్తుతం హత్య కేసు వాళ్ళ మెడకే చుట్టుకుంది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య కేసులో నిందితుడుగా సిబిఐ భావించి విచారణ జరుపుతోంది. ఒక వైపు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుంది అనే ఊహగానాల నడుమ కొత్తగా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి రెండో పెళ్లి గురించి అలాగే సంతానం గురించి బయటకు వార్తలు ప్రచారం ఆవుతున్నాయి. ఈ విషయాల మీద వైసీపీ లీడర్ జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడారు.

చనిపోయిన వ్యక్తి వ్యక్తిగత విషయాలు ఎందుకు…
వివేకానంద రెడ్డి హత్య మీద ఆరోపణలు ఎక్కువవడంతో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ హత్య కు తనకు సంబంధం లేదని హత్యకు కారణం వివేకానంద రెడ్డి రెండో భార్య పిల్లలు అంటూ మాట్లాడటం, ఇక వైసీపీ నేతలే వివేకానంద రెడ్డి ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడని వారికి ఒక కొడుకు ఉన్నాడని వివేకానంద రెడ్డి పేరు కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడు వంటి వివిధ ప్రచారాలను మొదలు పెట్టరు.

ఈ విషయం మీద జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి గురించి అతని మర్యాదకు భంగం కలిగించేలా మాట్లాడాల్సిన పని లేదు. ఇది వైసీపీ నేతల పని కాదు అంటూ మాట్లాడారు. కేవలం ప్రతిపక్షాలు మా మీద బురద జల్లడానికి చనిపోయిన వారిని కూడా వదలడం లేదు అంటూ మాట్లాడారు.