ప్రస్తుతం సీనియర్ మోస్ట్ దర్శకులల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. అతడి దర్శకత్వ పర్యవేక్షణలో.. రోణంకి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెళ్లిసందD’. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్ర బృందం ఇటీవల సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంకు వచ్చారు. ఇందులో హీరో, హీరోయిన్లతో పాటు మరికొంత మంది వచ్చారు.
దీనికి సబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు ఈటీవీ యాజమాన్యం. ఇందులో మొదట.. ఒకరినొకరు పరిచయం చేసుకొని.. సుమ, ఆ బృందంతో నవ్వులు పూయించింది. తర్వాత టాస్క్ ఆడుతున్న క్రమలో రాఘవేంద్ర రావు ఇలా అన్నాడు.. తమ బృందాన్ని మోసం చేశారంటూ ఆరోపించారు.
ఇక్కడకు తాము డబ్బులొస్తాయన్న కారణంతో వచ్చామని.. కానీ ఇక్కడ అంతా ప్లాన్ చేసి.. తమను గెలవనీయకుండా చేస్తున్నారని.. దీని వెనుకు ఎవరో ఉన్నారన్నారు. ఇలా చేయడం భావ్యమేనా? మా టీమ్ అంతా ఫూల్స్ అని మీ ఉద్దేశమా?’ అని సీరియస్ అయ్యారు. యాంకర్ సుమతో ఈ టీమ్ చేసిన అల్లరికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
సరదాగా సాగుతూనే చివరకు ఉత్కంఠ పెంచింది. దీంతో వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోవడం కనిపిస్తుంది. ఇది కొంతమంది నెటిజన్లు కేవలం ప్రోమో కోసమే అని.. దీనిలో నిజం లేదని చెబుతుండగా.. మరికొంతమంది రాఘవేంద్ర రావు నిజంగానే ఫీల్ అయ్యారని అంటున్నారు. సుమ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మరి వాళ్లు కూల్ అయ్యారా.. మళ్లీ ఆ ఎపిసోడ్ లో అందరు కలిసి ఆడారా లేదా అనేది తెలియాలంటే అక్టోబర్ 2న విడుదలయ్యే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాక ఆగాల్సిందే.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…