Kaikala Sathyanarayana : నవరస నట సార్వభౌముడిగా తాను పోషించిన ఏ పాత్రలోనైనా ఒదిగి పోయి హీరో అయినా, విలన్ అయినా, కరుణ రసమైనా, రౌద్రమైనా, హాస్యమైనా ఇలా ఏదైనా సరే అవలీలగా పోషించిన నటులు కైకాల సత్యనారాయణ గారు. ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన పుట్టింది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో 1935 జులై 25న జన్మించిన కైకాల గారు గుడివాడ కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటినుంచి నటనపై ఉన్న ఆసక్తితో విద్యార్థి దశలోనే ఎన్నో నాటకాలు, స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ప్రతిభను ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ గుర్తించారు. దాంతో ‘సిపాయి కూతురు’ సినిమాలో కైకాలకు మొదట అవకాశం ఇచ్చారు. 61 సంవత్సరాల పాటు సినిమా రంగంలో ఉన్న సత్యనారాయణ గారు దాదాపుగా 780 చిత్రాల్లో నటించారు.
కైకాల భోజన ప్రియుడు…
ఇక ఆయన పార్థివదేహానికి సినిమా ప్రముఖులు, ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనుండగా ఆయనతో జ్ఞాపకాలను పలువురు గుర్తుచేసుకుని బాధపడ్డారు. సత్యనారాయణ గారు భోజన ప్రియులు అంటూ ఆయన దగ్గర పదేళ్ళు పనిచేసిన వంట మనిషి నాగరాజు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి గారు ఒక క్లబ్ స్థాపించారు అందులో ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు , కైకలా సత్యనారాయణ, గిరిబాబు, పార్థసారథి, డైరెక్టర్ బి భాస్కర్ రావు ఎక్కువగా క్లబ్ లో ఉండేవారు. దాదాపు 30 మంది ఆ క్లబ్ మెంబెర్స్ గా ఉండేవారు.
1999లో క్లబ్ లో వంట చేయడానికి చేరగా అక్కడ కైకలా గారు పరిచయం అంటూ ఆయన మనుషులను చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, అంతే కేర్ చూపిస్తారు అంటూ తెలిపారు. గోధుమ రవ్వ తో చేసే ఉప్మాలోకి జీడిపప్పు, నెయ్యి వేసుకుని తినడం అంటే చాలా ఇష్టమని నాన్ వెజ్ ఎక్కువగా తినేవారు కాదు కానీ వెజ్ లో బాగా తినేవారు అంటూ చెప్పారు. ఇక సన్నబడాలి, పొట్ట తగ్గాలని ఉత్తరాది వాళ్ళ చపాతీలు అవి తినకూడదు, మనకు చిన్నపటి నుండి ఏది అలవాటో అదే తినాలి అంటూ సలహా ఇచ్చేవారంటూ నాగరాజు ఆయనను గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…