Kalpika Ganesh : హైదరాబాద్ లో పుట్టిన అయ్యంగర్ కుటుంబానికి చెందిన అమ్మాయి కల్పిక గణేష్. చదువుయ్యాక మొదట మోడలింగ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కల్పిక ఆ తరువాత చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రయాణం’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా తరువాత సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సీత ఆన్ రోడ్ వంటి పలు సినిమాల్లో నటించింది. ఇక అటు కొన్ని వెబ్ సిరీస్ లలోనూ నటించిన కల్పిక తాజాగా తమిళంలో మెయిన్ లీడ్ గా ‘పెరోల్’ అనే సినిమాలో నటించింది. తమిళంలో ఈ సినిమాకు మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఇక కల్పిక సోషల్ మీడియాలో చాలా అబ్యూస్ ను ఎదుర్కొంటోంది. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఒక్కోరోజు ఒక్కోపేరు బయట పెడతా…
క్యాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లోనూ ఉంది అన్నది వాస్తవమైనా ఎక్కువగా వినిపించేది మాత్రం సినిమా రంగంలోనే. ఎపుడూ ఎవరో ఒక సెలబ్రిటీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. వారు ఎదుర్కొన్న విషయాలను బయటపెడుతున్నా ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉంటూనే ఉన్నాయి. ఇక మరో క్యాస్టింగ్ కౌచ్ గురించి నటి కల్పిక గణేష్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. నేను బాధితురాలినే కానీ తొందరగా వాటి నుండి బయటపడ్డాను అంటూ చెబుతూ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ధనుష్, బాలాజీ మోహన్, ధన్య, అనిరుధ్ ఇలాంటి వారి పేర్లు క్యాస్టింగ్ కౌచ్ లో గతంలో బయటికి వచ్చాయి.
సుచీ లీక్స్ పేరుతో ఇంతకుముందు తమిళ ఇండస్ట్రీలో చాలామంది పేర్లు బయటికి వచ్చాయి. కానీ సింగర్ సుచిత్ర ను కనుమరుగయ్యేలా చేసి ఆ ఇష్యూని కనుమరుగయ్యేలా చేసేసారు. సింగర్ చిన్మయి కూడా ఈ ఇష్యూలో బాగా పోరాడినా ఆమెను సఫర్ చేసారు. అయితే నేనూ ఈ విషయంలో బాధపడిన వ్యక్తినే అందుకే నూతన సంవత్సరం వచ్చేలోపు రోజుకు ఒకరి పేరును బయటపెడతాను. ఎవరికీ బయపడాల్సిన పని లేదు నేను అంటూ కల్పిక గణేష్ మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…