Featured

Kajal Agarwal : ఆ బాధ నన్ను ఇప్పటికీ దహించి వేస్తోంది… తల్లయ్యాక జీవితం అంటే ఏంటో అర్థమైంది… కాజల్ అగర్వాల్

Kajal Agarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులు చందమామ అని పిలుచుకునే ఈ హీరోయిన్ పరిచయం అక్కర్లేని పేరు. ‘లక్షి కళ్యాణం’ సినిమాతో మొదలయి ‘చందమామ’ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ‘మగధీర’ సినిమాతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. టాప్ హీరోయిన్ పీఠం మీద కొన్నేళ్లు ఉన్న కాజల్ తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, హిందీ వంటి భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు టాప్ హీరోస్ అందరితో నటించిన కాజల్ తన చెల్లి నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా వచ్చింది. అయితే కాజల్ కి వచ్చినంత ఫేమ్ సక్సెస్ నీషాకు రాలేదు, దీంతో వ్యాపార వేత్త ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

ఆ అపరాధ భావం వెంటాడుతోంది…

ఇక కాజల్ కూడా కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు అందరికీ షాక్ ఇస్తూ పెళ్లి చేసుకుంది. గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లయ్యాక కూడా కెరీర్ కొనసాగించిన కాజల్ ఇటీవలే ఏప్రిల్ లో బిడ్డకు జన్మనిచ్చింది. మగ బిడ్డకు జన్మ నిచ్చిన కాజల్ బాబు కి నీల్ కిచ్లు అని పేరు పెట్టారు. ప్రెగ్నెన్సీ సమయంలో సినిమాలకు దూరమైన కాజల్ అభిమానులకు దూరం కాలేదు, తనకు సమబంధిచిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే బిడ్డ పుట్టాక తన జీవితం మారిపోయిందని తనకు బిడ్డ పుట్టాకే జీవితం అంటే అర్థమైందని కాజల్ ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నేహా దుపియా షోలో చెప్పింది. ఇక తాను మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నట్లు చెప్పింది.

నేహా దుపియా నిర్వహిస్తున్న “ఫ్రీడమ్ టూ ఫీడ్” అనే ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ తన బిడ్డకు రొమ్ము పాలు ఇవ్వడం మరచిపోలేని అనుభూతి అంటూ మొదట్లో నొప్పి భరించినా ఆ తరువాత నిపుణుల సలహాతో ఆ నొప్పిని ఆదిగమించానని చెప్పారు కాజల్. ఇక ప్రసవమయ్యాక 40 రోజులు ఇల్లు కదలలేదు దీంతో ఇంట్లోనే ఒక గదిలో నా బిడ్డ ఉంటే మరో గదిలో షూటింగ్ చేయాల్సి వచ్చేది. కొద్ది రోజులయ్యాక బయట షూటింగ్ చేయాల్సి వచ్చినపుడు తల్లి వద్ద నీల్ ను ఉంచాల్సి వచ్చినపుడు వాడిని చూసుకోడానికి తగినంత సమయం కేటాయించలేక పోయాననే అపరాధ భావం నన్ను బాధ పెట్టేది అంటూ చెప్పింది కాజల్. ఇక బయటికి పని మీద వెళ్ళవలసి వస్తే తల్లి వద్దే బిడ్డను ఉంచినా బబ్రెస్ట్ ఫీడ్ పంప్ సహాయంతో సమయానికి నా అబిడ్డకు పాలు ఇవ్వగలుగుతున్నానని కాజల్ తన అనుభవాలను పంచుకున్నారు. బిడ్డకు పాలు పట్టేటపుడు ప్రతి తల్లి ఆ మాధుర్యాన్ని అనుభవిస్తుంది నేను ఆ అనుభూతిని పొందానని చెప్పారు కాజల్ అగర్వాల్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago