Featured

Mike Tyson : లైగర్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసిన మైక్ టైసన్ !

Mike Tyson : విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సిమిమా గురించి అందరికి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించారు. సినిమా మీద హైప్ క్రియేట్ చేసిన అంశాలలో మైక్ టైసన్ నటించడం కూడా ఒకటి. అయితే లైగర్ సినిమాలో నటించడం గురించి మైక్ టైసన్ మాట్లాడిన ఒక పాత వీడియో ఇపుడు హల్ చల్ చేస్తోంది.

లైగర్ సినిమాలో తాను నటిస్తున్న సంగతి కూడా మర్చిపోయిన మైక్ టైసన్…

అమెరికాలోని ఒక యూట్యూబ్ ఛానల్ ఇటీవల మైక్ టైసన్ ను ఇంటర్వ్యూ చేశారు. అయితే అందులో మైక్ టైసన్ ను తాను చేస్తున్న లైగర్ సినిమా గురించి ప్రశ్నించగా అసలు లైగర్ సినిమా గురించి తనకు ఏమి తెలియదన్నట్టుగా చూడటంతో అందరు ఆశ్చర్య పోయి లైగర్ సినిమా ట్రైలర్ ను చూపించగా అపుడు ‘ఓ.. ఆ ట్రైలర్ లో వున్నది నేనే అనుకుంటా కదా’ అంటూ, దీని గురించి నాకు అసలు తెలియదు అని అంటారు.

ఇది ఇలా ఉండగా… విజయ్ దేవరకొండ సెట్లో మైక్ టైసన్ తో ఉన్న అనుభవాల గురించి మీడియాతో చెప్పడం తెలిసిందే. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎప్పుడు సెట్లో ఆయన బూతులు తిడుతూ ఉండేవాడు, అవి బయటకు చెప్పలేను అని చెప్పుకొచ్చారు. అయితే మైక్ టైసన్ లైగర్ సినిమా విడుదల ముందు ఆ సినిమా లో ఆయన నటిస్తున్న విషయం కూడా మర్చిపోయిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago