Featured

Mahesh Babu : నిజ జీవితంలో కూడా మహేష్ బాబు సూపర్ స్టార్… డాన్స్ ప్రోగ్రామ్ స్టేజి మీదనే కంటెస్టెంట్ కు బంపర్ ఆఫర్..!

Mahesh Babu : సూపర్ స్టార్ వారసుడిగా మహేష్ బాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదట బాల నటుడుగా ప్రస్తానాన్ని మొదలు పెట్టి, తరువాత 1999 లో ‘రాజకుమారుడు’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అయితే తండ్రి నీడలో కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి ఇప్పటికి టాలీవుడ్ ప్రిన్స్ లాగానే కొనసాగుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ హీరో అని కూడా అందరికి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది చిన్నారుల గుండె ఆపరేషన్ లకు సహాయం చేసి వారి మొహంలో సంతోషాన్ని తిరిగి తెప్పించారు. అయితే ఇపుడు తాజాగా మహేష్ చేసిన పని కారణంగా ఇంకోసారి రియల్ హీరో అని అనిపించుకుంటున్నారు.

స్టేజి మీదనే బంపర్ ఆఫర్ ప్రకటించిన మహేష్…

మహేష్ బాబు తన గారాల పట్టి అయిన సీతారతో కలసి ఒక టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనే ప్రోగ్రాంలో పాల్గొంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రోగ్రాంకు సంబందించిన ప్రోమో ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది. అయితే తాజాగా ఈ ప్రోగ్రాం కు సంబందించిన మరొక ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

తాజాగా విడుదల అయిన ప్రోమోలో బాబు, కుమార్ అనే ఇద్దరు కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ బాగా నచ్చి వారిని పొగడ్తలతో ముంచెత్తాడు. అక్కడితో ఆగకుండా నేను చేసే సినిమాలో కానీ నా సినిమాలో కానీ మీకు ఆఫర్ ఇస్తాను అని స్టేజి మీదనే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇది విని షాక్ లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు తరువాత తేరుకొని మహేష్ బాబు కాళ్ళ మీద పడ్డారు. అయితే మహేష్ వాళ్ళని పైకి లేపి హత్తుకున్నాడు. ఇలా మహేష్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించికుంటున్మాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago