Kalyan Ram: తండ్రి మరణం పై మొదటి సారి స్పందించిన కళ్యాణ్ రామ్.. అసలు ఆరోజు ఏం జరిగిందంటే?

Kalyan Ram: సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా నందమూరి హరికృష్ణ అందరికీ సుపరిచితమే. ఈయన ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగడమే కాకుండా రాజకీయాలలో కూడా కొనసాగారు. ఇకపోతే ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి కళ్యాణ్ రామ్ జానకి రామ్ ఎన్టీఆర్ ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇకపోతే హరికృష్ణ సైతం పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోను ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హరికృష్ణ గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు 29వ తేదీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ మొదటి సారి తన తండ్రి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఇకపోతే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా మూవీ చరిత్రాత్మక అంశంతో ముడిపడి ఉన్న ట్రావెల్ మూవీ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి ఒక ప్రశ్న ఎదురైంది. టైం ట్రావెల్ చేయాల్సి వస్తే.. ఏ రోజుకి వెళ్లి దేనిని ఆపాలి లేదా దీనిని మార్చాలి అనుకుంటారు? అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు కీరవాణి సమాధానం చెబుతూ తాను 2018 ఆగస్టు 28వ తేదీకి వెళ్లి హరికృష్ణ గారితో నాతో పాటు రెండు రోజులు మ్యూజిక్ సిట్టింగ్ వేయమని అడుగుతాను ఆయనకు నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలా రెండు రోజులు నాతో గడిపితే 29వ తేదీ ఆయన మరణాన్ని నేను ఆపవచ్చు అంటూ కీరవాణి తెలిపారు.

Kalyan Ram: నాన్నతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది…

ఇక ఆరోజు ఏం జరిగిందనే విషయం గురించి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ నాన్నగారు మరణించిన రోజు ఉదయం నేను ఇంట్లోనే ఉన్నాను. ఐదు గంటలకు నిద్రలేచి బాల్కనీలో టీ తాగుతూ కూర్చుని ఉండగా శివాజీ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అయితే ఆరోజు నాన్నతో పాటు ఈయన కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది శివాజీ అని అడిగేలోపు ఫోన్ కట్ అయింది.ఇకపోతే అదే రోజు మా మామయ్య ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి విజయవాడ వెళుతున్నారు ఆయన కాల్ చేసి ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు పెట్టారు. అది చూసి నేను రియాలిటీ లోకి రావడం అప్పుడే అసలు విషయం అర్థమైందని ఈ సందర్భంగా తన తండ్రి మరణం గురించి కళ్యాణ్ రామ్ మొదటిసారిగా స్పందించారు.