Featured

Naga Chaithanya : శోభిత తో అఫైర్ గురించి ఎట్టకేలకు స్పందించిన చైతూ..!

Naga Chaithanya : సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం ఎంత హాట్ టాపిక్ అవుతుందో వాళ్ళు విడిపోయినపుడు ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. అసలే సోషల్ మీడియా కాలం ఇంకేముంది ప్రతి ఒక్కరూ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు అన్నట్లుగా కథలు అల్లి ఇందుకే వీడిపోయారు అందుకే విడిపోయారు అంటూ పెట్టేస్తారు. ఇక వీడిపోయి వారి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నా వదులుతారా.. మళ్ళీ ఇంకెవరితోనో వారికి ప్రేమ అని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గాసిప్స్ పుట్టించి రచ్చ చేస్తారు. అసలు నిజంగానే సదరు సెలబ్రిటీ ఒక రిలేషన్ నుండి బయటకు రాగానే మళ్ళీ ఇంకొకరిని ప్రేమిస్తారో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం తొందరపెడుతారు. ఇప్పుడు ఈ చర్చంతా రీసెంట్ గా వీడిపోయిన సమంత, నాగ చైతన్య జంటకు చక్కగా కుదురుతుంది.

మళ్ళీ ప్రేమ గురించి రియాక్ట్ అయిన నాగ చైతన్య…

సమంత, నాగ చైతన్య ఎందుకు వీడిపోయారో ఎవరికీ కారనాలు చెప్పలేదు. ఇక వీడిపోయాక ఎవరి జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వారి కెరీర్ వైపు దృష్టి పెట్టి దూసుకుపోతున్నారు. కానీ సోషల్ మీడియా వీళ్లను వదులుతుందా, చైతూ పెళ్లి చేసుకోబోతున్నట్లు, ఈ సారి పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు అల్లేశారు. ఇక కొన్ని రోజుల తరువాత తెలుగమ్మాయి అయిన మేజర్, గూఢచారి సినిమా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ తో చైతూ డేటింగ్ లో ఉన్నాడంటూ రాసారు. చైతూ కొత్తింటికి శోభిత వస్తూ ఉంటుందని, ఇక శోభిత పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కి చైతూ వెళ్లాడంటూ కథలు రాసారు.

ఈ ఇష్యూ మీద శోభిత ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించి మిడిల్ ఫింగర్ చూపుతూ ఘాటుగానే సమాధానం చెప్పింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య కూడా ఈ ఇష్యూ పై స్పందించారు. తాజాగా నాగ చైతన్య నటించిన ‘థాంక్యు’ సినిమా విడుదలయింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య కు ఈ ఎఫైర్ గురించి ప్రశ్న ఎదురుకాగా చైతూ నవ్వి వదిలేస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు. అసలు ఆ రూమర్ గురించి స్పందించడం ఇష్టం లేదు అన్నట్లుగా ఉన్న ఆ సమాధానం తో చైతూ ఏంటి ఇలా చెప్పాడు అనుకుంటున్నారు అందరూ. ఇక చైతన్య నటించిన అమీర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్ధ’ ఆగష్టు 11 న విడుదల కాబోతోంది. ఇక ఇటీవల నటించిన థాంక్యూ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago