Kalyan Ram: సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా నందమూరి హరికృష్ణ అందరికీ సుపరిచితమే. ఈయన ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగడమే కాకుండా రాజకీయాలలో కూడా కొనసాగారు. ఇకపోతే ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి కళ్యాణ్ రామ్ జానకి రామ్ ఎన్టీఆర్ ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇకపోతే హరికృష్ణ సైతం పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు.
ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోను ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హరికృష్ణ గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు 29వ తేదీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ మొదటి సారి తన తండ్రి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇకపోతే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా మూవీ చరిత్రాత్మక అంశంతో ముడిపడి ఉన్న ట్రావెల్ మూవీ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి ఒక ప్రశ్న ఎదురైంది. టైం ట్రావెల్ చేయాల్సి వస్తే.. ఏ రోజుకి వెళ్లి దేనిని ఆపాలి లేదా దీనిని మార్చాలి అనుకుంటారు? అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు కీరవాణి సమాధానం చెబుతూ తాను 2018 ఆగస్టు 28వ తేదీకి వెళ్లి హరికృష్ణ గారితో నాతో పాటు రెండు రోజులు మ్యూజిక్ సిట్టింగ్ వేయమని అడుగుతాను ఆయనకు నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలా రెండు రోజులు నాతో గడిపితే 29వ తేదీ ఆయన మరణాన్ని నేను ఆపవచ్చు అంటూ కీరవాణి తెలిపారు.
ఇక ఆరోజు ఏం జరిగిందనే విషయం గురించి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ నాన్నగారు మరణించిన రోజు ఉదయం నేను ఇంట్లోనే ఉన్నాను. ఐదు గంటలకు నిద్రలేచి బాల్కనీలో టీ తాగుతూ కూర్చుని ఉండగా శివాజీ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అయితే ఆరోజు నాన్నతో పాటు ఈయన కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది శివాజీ అని అడిగేలోపు ఫోన్ కట్ అయింది.ఇకపోతే అదే రోజు మా మామయ్య ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి విజయవాడ వెళుతున్నారు ఆయన కాల్ చేసి ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు పెట్టారు. అది చూసి నేను రియాలిటీ లోకి రావడం అప్పుడే అసలు విషయం అర్థమైందని ఈ సందర్భంగా తన తండ్రి మరణం గురించి కళ్యాణ్ రామ్ మొదటిసారిగా స్పందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…