Uma Maheswari : ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి సోమవారం ఆగష్టు 1వ తేదీన ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు. ఈ విషయం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆత్మహత్యకు పాల్పడేంత కష్టాలు, ఇబ్బందులు ఏమున్నాయి అనే అనుమానం మొదలయింది. రెండు నెలల క్రితమే ఉమా మహేశ్వరి గారు తన చిన్న కూతురు దీక్షిత పెళ్లి ఘనంగా జరిపించారు. మొత్తం నందమూరి కుటుంబం ఆ వివాహ వేడుకలో సందడి చేసారు. ఇంతలోనే ఇలాంటి ఒక సంఘటన ఎవరూ ఊహించలేదు. నిజానికి ఉమా మహేశ్వరి గారు బయటవారికి చాలా తక్కువగా తెలుసు. పబ్లిక్ లోకి ఎక్కువగా రాని ఆమె సింపుల్ లైఫ్ ని జీవించేవారు. ఎన్టీఆర్ కుమార్తె అయినా ఇప్పటి తరానికి చాలా మందికి ఆమె తెలియదు.
షాక్ లో ఉన్న నందమూరి ఫ్యామిలీ…
ఆమె మరణాన్ని ఎవరూ ఊహించలేదు. అనారోగ్య సమస్యలు, డిప్రెషన్ తో బాధపడుతున్న ఉమా మహేశ్వరి అందుకోసం యాంటీ డిప్రెషన్ మందులను కూడా వాడుతున్నారు. ఉమా మహేశ్వరి పెద్ద కూతురు విశాల పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ఇక చిన్న కూతురు దీక్షిత కు రెండు నెలల క్రితమే పెళ్లి జరిగింది. ఇక సోమవారం తల్లి వద్ద సరదగా ఉండటానికి కూతురు, అల్లుడు కూడా ఇంటికి వచ్చారు. వారితో సరదాగా గడిపిన ఉమ గారు కాసేపయ్యాక పని మనిషికి వంట వద్దని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సాధారణంగా ఒంటరిగా ఒక గదిలో ఉమా మహేశ్వరి కి అలవాటు ఉండటంతో కూతురు అల్లుడు కూడా పట్టించుకోలేది. రెండు గంటలైనా తలుపులు తీయకపోయేసరికి అనుమానం వచ్చి గది తలుపులు కొట్టారు. అయినా స్పందన లేకపోవడంతో గది తలుపులు పగులకొట్టి చూడగా ఉమా మహేశ్వరి అప్పటికే చున్నితో ఉరి వేసుకుని మరణించారు. కోన ప్రాణం తో ఉన్నారేమో అని వెంటనే కిందికి దించి చూసినా అప్పటికే మరణించారు.
వెంటనే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇచ్చిన దీక్షిత, ఆ తరువాత నారా లోకేష్ తో మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో ఉమా మహేశ్వరి ఇంటికి దగ్గగర్లోనే ఉండే లోకేష్ వెంటనే ఎక్కడికి చేరుకొని మిగిలిన కార్యక్రమాలు చూసుకున్నారు. అయితే ఉమా మహేశ్వరి ముందుగానే కుటుంబ సభ్యులకు నేను ఏ కారణం చేత అయినా మరణిస్తే నా కళ్ళు దానం చేయమని ముందుగానే చెప్పారట. ఇక కుటుంబ సభ్యులు ఆమె కోరిక మేరకు కళ్ళు దానము చేసారు. పెద్ద కూతురు విదేశాల్లో ఉండటం వల్ల ఆమె వచ్చే వరకు ఉమా గారి అంత్యక్రియలు జరుపకూడదని నందమూరి కుటుంబం నిర్ణయించారు. అక్కడే ఉండి అన్ని పనులను బాలకృష్ణ, లోకేష్ తదితరులు చూసుకుంటున్నారు. ఇక విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ కుడా అంత్యక్రియలు సమయంలోపల వచ్చేస్తారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…